మళ్ళీ 2018 సీన్.. కాంగ్రెస్ మారదా?

-

తెలంగాణలో సొంతంగా సత్తా చాటే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం లేవు.. ఇప్పటికే ఆ పార్టీ చాలా వరకు వీక్ అయిపోయింది.. ఇప్పుడు బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో ఇంకా వీక్ అవుతూ వస్తుంది. ఆఖరికి సిట్టింగ్ స్థానమైన మునుగోడులో గెలవడానికి చిన్నాచితక పార్టీలని ఆశ్రయించాలసిన పరిస్తితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మునుగోడు ఉపఎన్నికలో గెలవడానికి ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు దూకుడుగా వ్యూహాలు వేసుకుంటూ ముందుకెళుతున్నాయి. ఇప్పటికే ఆ రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.

ఇక కాంగ్రెస్ మాత్రం సొంత పార్టీలోని లుకలుకలు సరిచేసుకోవడమే సరిపోతుంది. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ వెళ్లిపోవడంతో మునుగోడులో కాంగ్రెస్ బలం తగ్గింది. దీంతో మునుగోడులో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులని, కోదండరాం సపోర్ట్ కోసం తిరుగుతుంది. నిజానికి మునుగోడులో కమ్యూనిస్టుల బలం ఎక్కువే. అయితే ఇదంతా ఒకప్పుడు…ఇప్పుడు కమ్యూనిస్టుల హవా తగ్గింది. అయినా సరే కొన్ని ఓట్లు కలిసొచ్చిన ఉపయోగం ఉంటుందని చెప్పి కమ్యూనిస్టుల మద్ధతు కోసం కాంగ్రెస్ పాకులాడుతుంది.

అటు కమ్యూనిస్టులు ఏమో పోటీ చేయాలని చూస్తున్నారు…కానీ పోటీ చేస్తే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది…అందుకే టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలకు మద్ధతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం…తెలంగాణ జనసమితి పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పార్టీ రాజకీయంగా సక్సెస్ కాలేదు. అలాంటి పార్టీ మద్ధతు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది.

మునుగోడు ఉప ఎన్నికలో మద్దతు కోసం కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం కోదండరాంతో కలిసి చర్చించింది. కాంగ్రెస్ కు మద్దతుపై పార్టీలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని భేటీ తర్వాత కోదండరాం తెలిపారు. అయితే ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామని, టీఆర్‌ఎస్‌, బీజేపీ మినహా అందరి మద్దతు కోరతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్…టీడీపీ, టీజేఎస్, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం…ఇంకా చిన్నాచితక పార్టీలతో పొత్తు పెట్టుకుని దారుణంగా విఫలమైంది. ఇప్పుడు అదే దారిలో వెళ్తామని అంటున్నారు…మరి మునుగోడులో కాంగ్రెస్ పరిస్తితి ఏం అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version