రేసులో కాంగ్రెస్..అదొక్కటే మైనస్.. రేవంత్‌కు కష్టమేనా? 

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ అని చెప్పొచ్చు..ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం ఎక్కువగానే ఉంది..అధికార టీఆర్ఎస్ పార్టీకి ఢీ అంటే ఢీ అనేలా పోటీ ఇచ్చే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని గట్టిగా చెప్పొచ్చు. కానీ తెలంగాణ రాజకీయాల్లో ఆ పరిస్తితి కనిపిస్తుందా? అంటే లేదనే చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది..ఆ పార్టీ సై అంటే సై అనేలా రాజకీయం చేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, ఇప్పుప్పుడే తెలంగాణలో బీజేపీ మరింత బలపడటం అడ్వాంటేజ్ గా మారింది.

అసలు ఉపఎన్నికల్లో గెలిచి అనూహ్యంగా కమలం పార్టీ రేసులోకి వచ్చింది. సరే కమలం రేసులోకి వచ్చింది బాగానే ఉంది…కానీ ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం ఉందా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో మాత్రం కమలం పార్టీకి పూర్తి బలం కనిపించడం లేదు. ఎందుకంటే బీజేపీకి కింది స్థాయిలో కార్యకర్తల బలం లేదు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నాయకులు కూడా లేరు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ ఇబ్బంది లేదు. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు…బలమైన కార్యకర్తలు ఉన్నారు.

మరి అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా…కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు పార్టీని బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. అసలు మెయిన్ మైనస్ అంతర్గత విభేదాలు. మొదట నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇదే తలనొప్పి ఉందని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ విభేదాలు తగ్గుతాయో అప్పుడే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది. వైఎస్సార్ ఉన్నప్పుడు ఈ విభేదాలు పెద్దగా కనిపించలేదు. అందుకే అప్పుడు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు సక్సెస్ కావాలంటే విభేదాలు తొలిగిపోయి…నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలి. పి‌సి‌సి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి..పార్టీని ఏకతాటిపైకి తీసుకొస్తేనే కాంగ్రెస్ ఆటోమేటిక్ గా రేసులోకి వస్తుంది…లేదంటే టీఆర్ఎస్-బీజేపీ మధ్య జరిగే పోరుని కాంగ్రెస్ పార్టీ చూడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version