‘హస్తం’ ఆపరేషన్: రేవంత్ టార్గెట్ మిస్ అవ్వట్లేదుగా!

-

ఓ వైపు రాష్ట్రంలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ ఓ రేంజ్ లో నడుస్తుంటే..కాంగ్రెస్ మాత్రం సైలెంట్ గా బలపడే పనిలో ఉంది. అసలు టీఆర్ఎస్-బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరగడం…ఈ సమావేశాలకు ప్రధాని మోదీతో పాటు జాతీయ నాయకులు రానున్నడటంతో..హైదరాబాద్ లో కాషాయ జెండా రెపరెపలు మొదలయ్యాయి. ఇక బీజేపీకి పోటీగా టీఆర్ఎస్ సైతం…హైదరాబాద్ ని గులాబీ జెండాలతో నింపేస్తుంది.

పైగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా తెలంగాణలో అడుగుపెట్టనున్నారు…అది కూడా మోదీ సభ జరగనున్న రోజే..ఇక యశ్వంత్ కు భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఇలా రెండు పార్టీల మధ్య యుద్ధం నడుస్తుంది. ఇలా టీఆర్ఎస్-బీజేపీలు కొట్టుకుంటుంటే మధ్యలో కాంగ్రెస్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. నిదానంగా బలపడేందుకు చూస్తుంది…టీఆర్ఎస్-బీజేపీల్లో ఉన్న అసంతృప్త నేతలని కాంగ్రెస్లోకి లాగేందుకు చూస్తుంది.

ఇప్పటికే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…అసంతృప్తిగా ఉన్న నేతలని టార్గెట్ గా పెట్టుకుని రాజకీయం నడుపుతున్నారు. అందులో బలమైన నాయకులని పార్టీలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు…అలాగే మరికొందరు పార్టీల చేరేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బడంగ్ పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధమయ్యారని తెలిసింది.

అటు మీర్ పేట్ మేయర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం చెంతకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వీలు చూసుకుని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం కారు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో సీటు దక్కదనే వారిని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ లాగేసేలా ఉంది. మొత్తానికి రేవంత్ సైలెంట్ గా టార్గెట్ రీచ్ అయ్యేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version