తెలంగాణలో మళ్లీ గేమ్ స్టాట్ చేసిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ తట్టుకోగలదా..?

-

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హైఓల్టేజ్ ను తలపిస్తున్నాయి.. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రంపజుగా మారింది.. సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేస్తే.. దానికి బీఆర్ఎస్ నుంచి వెంటనే కౌంటర్ అటాక్ లు పేలుతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ గేమ్ ఛేంజ్ చేసింది.. వారి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మళ్లీ చేరికలను ప్రోత్సాహిస్తోంది.. ఇంతకీ పీసీసీ ఛీప్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలపై ఆంతర్యమేంటో చూద్దాం..

బీఆర్ఎస్ దూకుడు కళ్లెం వేసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.. ఆ పార్టీలో ఉండే బలమైన , సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తోంది.. తెలంగాణలో జంపింగ్ సీజన్ షురూ అయిందనే కామెంట్స్ కు బలం చేకూర్చేలా బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంది..

బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు తమతో టచ్ ఉన్నారంటూ పీపీసీ ఛీప్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మంటలు పుట్టిస్తున్నాయి..మాజీ ఎంపీ సోమం బాపురావ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీ తీర్దం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది.. హస్తం పార్టీతో టచ్ లో ఉండేవారిపై గురి పెట్టింది.. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది.. గతంలో ఫిరాయింపులకు బ్రేక్ పడినతర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు మళ్లీ.. అప్రమత్తమైంది..

గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారనే ప్రచారం ఆ పార్టీలో జరుగుతోంది.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత సన్నిహితులతో పాటు.. నిత్యం కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోసేవారు కూడా పార్టీలో చేరబోతున్నారంటూ హస్తం నేతలు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.. దీంతో గ్రేటర్ నుంచి ఎవరు అధికార పార్టీలోకి చేరబోతున్నారా అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..

ఇద్దరు మాజీమంత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయనే ప్రచారం జోరుందుకుంది.. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన చేరారు. మరింత మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతారన్న చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది.. దీన్ని గులాబి దళపతి ఎలా ఎదుర్కొంటారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version