ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని మలక్ పేట మెట్రో స్టేషన్ కింద అగ్ని ప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో మెట్రో స్టేషన్ కింద పార్కు చేసినటువంటి వాహనాలకు ఈ మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా భారీగా పొగ వ్యాపించింది.
మెట్రో ప్రయాణికులతో పాటు రోడ్డు పై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే 5 బైకులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరగడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు.