కాకతీయులు పాలించిన ఓరుగల్లుకు మంచి రోజులు రానున్నాయా..? ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు సిద్దమైందా..? రెండో రాజధానిగా వరంగల్ ను అభివృద్ది చేస్తామని హస్తం పార్టీ నేతలు ఇచ్చిన హామీలో రాజకీయ కోణం ఏమైనా ఉందా.? ఇంతకీ ఆ జిల్లా ప్రజానికంలో జరుగుతున్న చర్చేంటో చూద్దాం..
కాకతీయులకు ఆయుపట్టుగా ఉన్న ఓరుగల్లు ప్రతిష్ట పెరగబోతోంది.. ఈ ప్రాంతాన్ని రెండో రాజధానిగా ప్రకటించి.. అభివృద్ది చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు.. హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ది చేస్తామని పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు..అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతల ఈ హామీపై దృష్టి పెట్టారు.
41 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డును మూడు దశల్లో పూర్తి చెయ్యాలని పరాణాళికలు సిద్దమవుతున్నాయి.. దాంతో పాటు.. ఏడాదిలోపు మామూనూరు ఎయిర్ పోర్ట్ ను సిద్దం చెయ్యాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు..
భద్రకాళి చెరువుపూడికతీత, ముంపు నివారణ చర్యలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.. వరంగల్ ను రెండో రాజధానిగా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటోంది.. అయితే చిన్న చిన్న పనులు చేసి.. రెండో రాజధాని అంటే సరిపోదని.. పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి.. హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చెయ్యాలనే డిమాండ్లు వినిపిస్గున్నాయి.. అసెంబ్లీ సమావేశాలను కూడా ఇక్కడే నిర్వహిస్తే రెండో రాజధానిగా పేరు వస్తుందని చెబుతున్నారు..
ఇవేమీ చెయ్యకుండా రెండో రాజధాని అంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తే అవి పొలిటికల్ స్ట్రంట్స్ మాత్రమే అవుతాయని జిల్లా వాసులు విమర్శిస్తున్నారు.. వరంగల్ ప్రతిష్టను బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించిందంటున్న కాంగ్రెస్ పార్టీ.. వారి చిత్తుశుద్దిని నిరూపించుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.. అయితే విడదీసిన హన్మకొండ, వరంగల్ ను కలిపి ప్రతిష్ట నిలబెడతామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇస్తున్నారు.. మొత్తంగా వరంగల్ కు రాజధాని రేంజ్ లో అభివృద్ది చేస్తారో లేదో చూడాలి..