హస్తం స్ట్రాటజీలు…మునుగోడు దక్కేనా?

-

తెలంగాణలో పికప్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నానా కష్టాలు పడుతుంది..ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారం కోల్పోవడం  వల్ల పార్టీ పరిస్తితి చాలా వరకు దిగజారిపోయింది…ఈ సారి కూడా అధికారం కోల్పోతే కాంగ్రెస్ పరిస్తితి అంతే సంగతులు. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీల మధ్యే మెయిన్ ఫైట్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది…దీని వల్ల కాంగ్రెస్ రేసులో వెనుకబడిపోయినట్లు అనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీని రేసులోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

అయితే పార్టీ రేసులో రావడానికి మునుగోడు రూపంలో మంచి అవకడం దక్కింది. ఈ ఉపఎన్నికలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చినట్లే. ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ లేదా బీజేపీ గెలిచాయి. కాంగ్రెస్ ఒకటి గెలుచుకోలేదు. ఈ క్రమంలో మునుగోడులో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఎలాగో టీఆర్ఎస్ పార్టీకి రెండు, బీజేపీకి రెండు ఇచ్చారు కదా..మునుగోడు తమకు ఇవ్వాలని రేవంత్ మునుగోడు ప్రజలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

అలాగే ఇక్కడ బలంగా ఉన్న కమ్యూనిస్టుల మద్ధతు కూడా దక్కించుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా మునుగోడులో గెలవడానికి అన్నీ వ్యూహాలు వేస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈ స్థాయిలో పనిచేయలేదు గాని..ఇప్పుడు మునుగోడుపై మాత్రం పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఎక్కడకక్కడ పార్టీ కార్యకర్తలు జారిపోకుండా, బూత్ స్థాయి నుంచి తమ సత్తా ఏంటో చూపించాలని రేవంత్ భావిస్తున్నారు. ఇక ఈ నెల 20 నుంచి రేవంత్ మునుగోడులోనే మకాం వేయనున్నారు. మండలాల వారీగా నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యి, ఇంకా దూకుడుగా పనిచేసేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.

ఇప్పటికే మునుగోడులో మండలాల వారీగా ఇంచార్జ్ లని పెట్టారు. ఒకో మండలానికి ఇద్దరేసి చొప్పున ఇంచార్జ్ లని పెట్టారు. వీరి పని అంతా నేతలు, కార్యకర్తలతో సమావేశం అవ్వడం, ఉప ఎన్నికలో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించడం. టోటల్ గా ఉపఎన్నికలో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్లనుంది. మరి మునుగోడు హస్టానికి చిక్కుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version