ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోగా రైతులకు ద్రోహం చేశారు : బీజేపీ విష్ణువర్థన్‌ రెడ్డి

-

మరోసారి ఏపీ ప్రభుత్వం విమర్శలు గుప్పి ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. తాజాగా విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అయితే ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టకపోవడం , వాటిని రైతుల కోసం ఆ నీటినివినియోగం చేయలేకపోవడం శోచనీయమని విమర్శలు గుప్పించారు. బుధవారం తిరుపతిలో మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో జగన్ సర్కార్‌‌ కు చిత్తశుద్ధి లేదన్నారు విష్ణువర్థన్ రెడ్డి. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న జగన్ గారు సాగునీటి ప్రాజెక్టులపై 3సం.లో ఖర్చు పెట్టింది ₹15393 కోట్లు ఈ విధంగా మీరు సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టినట్లయితే రానున్న 25 సంవత్సరాలు కూడా రాష్ట్రం లో ప్రాజెక్టులు పూర్తి కావన్నారు విష్ణువర్థన్ రెడ్డి. రైతుల కల నెరవేరదు అన్నారు. రివర్స్ టెండర్లు పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు విష్ణువర్థన్ రెడ్డి.

హంద్రీనీవా, గాలేరు, నగరి వంటి తోటపల్లి , లాంటి ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోగా రైతులకు ద్రోహం చేశారన్నారని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నాం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేసిందా అని నిలదీశారని విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు విష్ణువర్థన్ రెడ్డి. 38 నెలల మీ పాలనలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేసారా అని ప్రశ్నించారు విష్ణువర్థన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కేంద్రంపై నెట్టి వైకాపా ప్రభుత్వం చేసిన తప్పుల నుండి తప్పించుకునేందుకు జగన్ సర్కార్ ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యలు చేశారు విష్ణువర్థన్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version