కరోనా పీకమీద కూర్చున్నా వాళ్ళేందుకు కేర్ చెయ్యట్లేదు ?

-

కరోనా వైరస్ కి అగ్రరాజ్యం మరియు పేద దేశం అనే తేడా లేకుండా దాని పని అది చేసుకుంటూ పోతోంది. మొదటిలో ఈ వైరస్ 26 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే దాని బలం కోల్పోతుందని చెప్పినా గాని ప్రస్తుతం మాత్రం అలాంటి సీన్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో చాలా అరబ్బు దేశాలలో జైలులో ఉన్న ఖైదీలను రిలీజ్ చేస్తున్నారు. రంజాన్ మాసం కావడంతో కరోనా వైరస్ ప్రభావం చాలా ప్రమాదకర స్థితిలో కి వెళ్తున్న తరుణంలో వాళ్ల దగ్గర వివరాలు మరియు సరైన ప్రభుత్వ కార్డులను తీసుకుని, ఖైదీలను జైలు నుండి  రిలీజ్ చేస్తున్నాయి. దుబాయి దేశం లో దాదాపు ఇటీవల 874 మంది ఖైదీలను రిలీజ్ చేశారు. కాగా అరబ్ కంట్రీ లలో పరిపాలకులు ఈ విధంగా ప్రజల ప్రాణాల కోసం జైలులో ఉన్న ఖైదీలను విడిచిపెడుతుంటే, యూరప్ వంటి దేశాలలో కరోనా పీకమీద కూర్చున్నా గాని అక్కడ పాలకులు డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు యూరప్ కంట్రీలలో ఏ దేశంలో కూడా జైలులో ఉన్న ఖైదీలను రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. 

 

చాలామంది గుంపులు గుంపులుగా ఉండేచోట వైరస్ విస్తరించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సమస్యలు లాంటివి చెబుతున్న, అలంటి హెచ్చరికలను యూరప్ దేశాలు పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయంపై యూరప్ దేశాల పై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం నడుస్తూ ఉండగానే యూరప్ దేశాలు ఖైదీలు బయటికి వెళితే తిరిగి పట్టుకుని చాన్స్ ఉండదని… జైలులో కరోనా వైరస్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పరిపాలకులు చెప్పుకొస్తున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version