మొన్నటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ధర పలికన టమాట ఒక్కసారిగా పడిపోయింది. ముఖ్యంగా ఏపీలో కొన్ని ప్రాంతాల్లో రైతులు హోల్ సేల్ వ్యాపారులకు రూ.5కే విక్రయిస్తున్నట్లు సమాచారం. ధరలు తగ్గినప్పుడు కేజీ రూ.8కి కొనాలన్న మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలను వ్యాపారులు బేఖాతర్ చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, బహిరంగ మార్కెట్లో టమాట కేజీ ధర రూ.10 నుంచి 15 వరకు పలుకుతోంది. టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో తమకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు అన్నదాతలు నష్టపోతుంటే వ్యాపారులు మాత్రం భారీగా లాభపడుతున్నారు. మొన్నటివరకు ధరల పెరుగుదలతో సతమతం అయిన సామాన్యులు మాత్రం టమాట ధరలు తగ్గడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.