విజయసాయిరెడ్డి కొన్న స్థలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి పరిధి చంద్రగిరిలో ఎంపీ విజయసాయిరెడ్డికి చెందిన స్థలంలో వెలసి ఉంది శ్రీ నాగాలమ్మ ఆలయం. అయితే…. శ్రీ నాగాలమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశంలో రసాభాస నెలకొంది. విజయసాయిరెడ్డి రెడ్డి ఆదేశాలతో అడహక్ కమిటీని ప్రకటించింది యుగుంధర్ రెడ్డి వర్గం. ఛైర్మన్’గా వేణుంబాక సునందా రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా విజయసాయిరెడ్డిగా ప్రకటన చేశారు. విజయసాయిరెడ్డిని కలిసి సంక్రాంతి తర్వాత కమిటీని ప్రకటిస్తామని తెలిపింది ఒంటి శివశంకర్ రెడ్డి వర్గం.
యుగుంధర్ రెడ్డి, ఒంటి శివశంకర్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేపటి నుంచి అమ్మవారికి నిత్యం కైంకర్యాలు చేపడుతామని ప్రకటించింది నూతన కమిటీ. ఎవరికి వారు కమిటీలు ప్రకటించుకుంటే గ్రామ పెద్దలకు విలువ ఉండదని తెలిపింది ఒంటి శివశంకర్ రెడ్డి వర్గం. అందరి సమ్మతితో సంక్రాంతి తర్వాత కమిటీని ప్రకటిస్తామని పేర్కొన్నారు ఒంటి శివశంకర్ రెడ్డి. దీంతో విజయసాయిరెడ్డి కొన్న స్థలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.