కరోనా వైరస్ మహమ్మారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భయంకరంగా ఉంది. రోజురోజుకీ కేసులు బయట పడుతున్న తరుణంలో కరోనా వైరస్ ‘సెగ’ తట్టుకోలేక పోతున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం కావడంతో వైరస్ వచ్చిన ప్రారంభంలో సరిహద్దులు మూసివేసి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.
వేసవి కాలం లో వైరస్ ఎక్కువగా బలపడే అవకాశం లేకపోవడంతో ఉత్తర ప్రదేశ్ లో జూన్ 30 వరకు లాక్ డౌన్ అమలు లో ఉంచాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు టాక్. మరో మహారాష్ట్ర లాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అవ్వకూడదు అని యోగి లాక్ డౌన్ ఈసారి కఠినంగా అమలు చేయటానికి సరి కొత్త రూల్స్ తీసుకు రాబోతున్నట్టు సమాచారం.