వరంగల్ పరువు తీయకండి..కాంగ్రెస్ విజయోత్సవ సభపై బీఆర్ఎస్ సైటెర్లు!

-

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యేందుకు వస్తున్న సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహకాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు పయనమయ్యారు. దీంతో అక్కడ ప్రజా విజయోత్సవ సభను మంత్రి కొండా సురేఖ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

 

ఈ క్రమంలోనే విజయోత్సవ సభపై బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘మోసానికి పన్నెండు మాసాలు. అందుకే వరంగల్ కు వచ్చి సభ పెడుతున్నారా?
వరంగల్‌లో విజయోత్సవాలు పెట్టి, వరంగల్ పరువు తీయకండి. అయినా, మీరు చేసుకోవాల్సింది విజయోత్సవాలు కాదు. వైఫల్యోత్సవాలు, విధ్వంసోత్సవాలు, వంచనోత్సవాలు జరుపుకోండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version