మంత్రి జూపల్లి, సీఎం రేవంత్‌ను బూతులు తిడుతున్న కాంగ్రెస్ ఫాలోవర్..

-

గతేడాది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని దేవరకొండకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త పుల్లయ్య తీవ్రంగా మండిపడ్డారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి జూపల్లి కృష్ణ రావు టీ షర్ట్ వేసుకొని కాంగ్రెస్ పార్టీని,రేవంత్ రెడ్డిని పచ్చి బూతులు తిడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘రేవంత్ రెడ్డిని గెలిపించి మా కన్ను మేమే పొడుచుకున్నాము.మోస పోయి ఓటు వేశాము.

ఇకనుండి అయినా మంచిగా చేయమనండి.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమందుకు నన్ను కాండ్రించి ఉమ్ముతున్నారు. నేను 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరాను.. అప్పటినుండి రేవంత్ రెడ్డి లాంటి ఒకడిని చూడలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం మంచిగా పనిచేసింది.సంక్షేమ పథకాలు అందరికీ అందాయి. ఆరుగ్యారెంటీల అమలు ఊసేలేదు.కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించినందుకు మా ఊరొళ్లంతా నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు’అని ఆవేదన వ్యక్తం చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version