మునుగోడు ‘కౌంటింగ్’కు కౌంట్‌డౌన్ స్టార్..!

-

తెలంగాణ ప్రజలే కాదు..పక్కనే ఉన్న ఏపీ ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉపఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది..మరికొన్ని గంటల్లో కౌంటింగ్ మొదలుకానుంది. దాదాపు 2.41 లక్షల ఓటర్లు ఉన్న మునుగోడులో..2.25 లక్షల మంది ఓటర్లు ఉపఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 93 శాతం పోలింగ్ నమోదైంది.

ఆదివారం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కానుంది…మొదట పోస్టల్ ఓట్లని లెక్కిస్తారు. మునుగోడులో 686 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. కౌంటింగ్ కోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేయగా, మొత్తం 298 బూత్‌ల్లోని ఈవీఏంల్లో నిక్షిప్తమైన ఓట్లని 15 రౌండ్లలో లెక్కించనున్నారు. ఉదయం 9 గంటలకల్లా మొదట ఫలితం వెలువడుతుంది..తుది ఫలితం మధ్యాహ్నం 1 గంటకు వెలువడనుంది. ఇక మొదట చౌటుప్పల్ మండలంలోని ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లని లెక్కిస్తారు.

అయితే మునుగోడులో గెలుపుపై అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీలు ధీమాగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్‌దే గెలుపు అని తేలింది. రెండో స్థానంలో బీజేపీ ఉంది. ఇక మూడోస్థానంలో కాంగ్రెస్ ఉంది. మునుగోడులో గెలుపుపై కాంగ్రెస్ ఆశలు వదిలేసుకుందని చెప్పొచ్చు. ఇక భారీగా ఓట్లు నమోదు కావడంతో గెలుపు ఎవరిదనేది క్లారిటీ రావడం లేదు. పైగా సాయంత్రం సమయంలో ఓటర్లు భారీగా వచ్చి ఓట్లు వేశారు. వారు ఎవరికి వేశారనేది అంచనాకు రావడం లేదు.

అయితే భారీ సంఖ్యలో యువత ఓట్లు వేశారు..ఆ యువత ఓట్లు బీజేపీ వైపే ఉంటాయని అంచనా. అలాగే 45 ఏళ్ళు దాటిన వారు..పింఛన్ లబ్దిదారులు, పథకాల లబ్దిదారులు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారని అంచనా. ఇక కాంగ్రెస్ తరుపున మహిళా అభ్యర్ధి ఉండటంతో…మహిళల ఓట్లు కాస్త కాంగ్రెస్ వైపుకు ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే టీఆర్ఎస్-బీజేపీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు ఫైట్ నడవచ్చు. మరి చివరికి మునుగోడు ఎవరి సొంతమవుతుందో మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version