జగన్ ని ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తారు…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు తీవ్రతరం చేసాయి. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాజకీయ పార్టీల ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఉన్న లక్ష్యాల కోసం రాజధానిని తరలించవద్దని పలువురు డిమాండ్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

తెలుగుదేశ౦, సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి పోరాడుతున్నాయి. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాజధాని ప్రాంతంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్‌ తుళ్లూరులో కనిపిస్తే మహిళలు ముక్కలు, ముక్కలుగా నరికేస్తారని, అందుకే ఆయన పోలీసులను అడ్డు పెట్టుకొని తిరుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక గాడిద అమరావతిని స్మశానమంటాడని… వాడొక మంత్రి. పేరు బొత్స అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఇక్కడి ప్రజలకు భయపడి గుండుకొట్టించుకొని తిరుగుతున్నాడన్నారు. ఇక్కడి ప్రజలు ఎంతో శాంతమూర్తులన్న ఆయన… 50 రోజులైనా శాంతియుతంగా ఉద్యమిస్తున్నారని కొనియాడారు. అదే మా రాయలసీమలో అయితే ఎక్కడికక్కడ పగలగొట్టేవాళ్లమన్నారు. చరిత్రలో 151 సీట్లతో మరోసారి ఏ పార్టీ గెలుస్తుందో, లేదో తెలియదన్న ఆయన… అలాంటిది జగన్‌ మంచి పరిపాలన చేయాల్సిందిపోయి ప్రజావ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version