జగన్ సిబిఐ విచారణ అని చెప్పినా బిజెపి డ్రామా అవసరమా…?

-

అంతర్వేది ఘటనపై బీజేపీ రాద్దాంతం చేయడం ఎందుకు? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనను అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయని ఆయన అన్నారు. అంతర్వేది ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశించిందని ఆయన అన్నారు. అయినా బిజెపి చలో అంతర్వేది పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.

అంతర్వేది వెళ్లే బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్లు, నిర్బంధాలు చేసి ప్రచారం కల్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని నిలదీశారు. ఒకపక్క కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉంటున్న వైసీపీ మరో పక్క రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకమన్నట్లు ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు. బీజేపీ వైసీపీ ల దోబూచులాట ఇకనైనా కట్టిపెట్టాలి రామకృష్ణ హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version