ఖైరతాబాద్‌ కింగ్ ఎవరు?వారిపైనే దానం ఆశలు .!

-

తెలంగాణలో ఈ సారి త్రిముఖ పోరు జరగడం ఖాయమనే చెప్పాలి. అయితే కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది..మరికొన్ని స్థానాల్లో బి‌జే‌పికి పట్టు ఉంది. దీంతో కొన్ని స్థానాల్లో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య, మరికొన్ని స్థానాల్లో బి‌ఆర్‌ఎస్, బి‌జేపిల మధ్య ఫైట్ జరగనుంది. ఇక మెజారిటీ స్థానాల్లో మూడు పార్టీల మధ్య పోరు జరగడం ఖాయం. ఎం‌ఐ‌ఎంకు చెందిన 7 సీట్లు తీసేసి..మిగిలిన సీట్లలో ఈ మూడు పార్టీల మధ్యే పోటీ ఉంటుంది.

ఇదే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఖైరతాబాద్ లో ఈ సారి ట్రైయాంగిల్ ఫైట్ ఖాయమే. అసలు గత మూడు ఎన్నికల నుంచి ఇక్కడ త్రిముఖ పోరే జరుగుతుంది. 2009లో కాంగ్రెస్, ప్రజారాజ్యం, టీడీపీల మధ్య పోరు నడిచింది. అప్పుడు కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ గెలిచారు. 2014లో కూడా త్రిముఖ పోరు జరిగింది. బి‌జే‌పి, కాంగ్రెస్, వైసీపీల మధ్య పోరు జరిగింది. ఇక టి‌డి‌పితో పొత్తులో బి‌జే‌పి నుంచి చింతల రామచంద్రారెడ్డి ఇక్కడ గెలిచారు.

2018లో మళ్ళీ త్రిముఖ జరిగింది…బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడ్డాయి. ఈ సారి బి‌ఆర్‌ఎస్ నుంచి దానం నాగేందర్ గెలిచారు. మళ్ళీ ఇప్పుడు ట్రైయాంగిల్ ఫైట్ నడవనుంది. బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిల మధ్యే ఫైట్. బి‌ఆర్‌ఎస్ నుంచి మళ్ళీ దానం నాగేందర్..బి‌జే‌పి నుంచి సి. రామచంద్రారెడ్డి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి పి‌జే‌ఆర్ వారసురాలు విజయారెడ్డి పోటీ చేయడం ఖాయమే.

దీంతో మళ్ళీ ఇక్కడ ట్రైయాంగిల్ ఫైట్ జరుగుతుంది. అయితే ఇక్కడ కొద్దిగా టి‌డి‌పి ఓటర్లు ఉన్నారు. టి‌డి‌పి పోటీ చేస్తే ఓట్లు చీలే ఛాన్స్ ఉంది. అలాగే కాంగ్రెస్, బి‌జే‌పిల మధ్య ఓట్లు చీలితే మళ్ళీ తనకు గెలిచే అవకాశాలు ఉంటాయని దానం ఆశలు పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఓట్ల చీలికపైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. చూడాలి మరి ఈ సారి ఖైరతాబాద్ కింగ్ ఎవరో?

Read more RELATED
Recommended to you

Exit mobile version