చంద్రబాబుకు దేవినేని షాక్… వైసీపీలో చేరటానికి రంగం సిద్ధం..!

-

దేవినేని అవినాష్ ఎవరో కాదు.. దివంగత నేత దేవినేని నెహ్రూ కొడుకు. ఆయన టీడీపీలో ఉన్న సమయంలోనే 2017లో గుండెపోటు రావడంతో చనిపోయారు. అప్పటి నుంచి అవినాష్ కూడా టీడీపీలోనే ఉన్నారు.

ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ భారీ షాక్ ఇఛ్చారు. తెలుగు యువత అధ్యక్షుడి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. దీంతో చంద్రబాబు పార్టీ టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

ఇక.. అవినాశ్ త్వరలోనే వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. వైసీపీ నుంచి అవినాష్ కు భారీ ఆఫర్ వచ్చిందట. వైఎస్సార్సీపీ పార్టీలో చేరితే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తామంటూ వైసీపీ హైకమాండ్ నుంచి ఆఫర్ రావడంతో అవినాష్ ఏమాత్రం ఆలోచించకుండా టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు.

దేవినేని అవినాష్ ఎవరో కాదు.. దివంగత నేత దేవినేని నెహ్రూ కొడుకు. ఆయన టీడీపీలో ఉన్న సమయంలోనే 2017లో గుండెపోటు రావడంతో చనిపోయారు. అప్పటి నుంచి అవినాష్ కూడా టీడీపీలోనే ఉన్నారు.

అయితే.. 2014లోనే దేవినేని నెహ్రూతో పాటు అవినాష్ కూడా వైసీపీలో చేరాల్సింది. కానీ.. చివరి నిమిషంలో వాళ్లు టీడీపీలో చేరారు.

ఇక.. అవినాష్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. అవినాష్ కు గుడివాడ టికెట్ ఇచ్చే సమయంలో టీడీపీలో అంతర్గతంగా చాలా గొడవలు అయ్యాయట. అవినాష్ కు గుడివాడ టికెట్ ఇవ్వొద్దని టీడీపీ నేతలు చంద్రబాబుకు చెప్పినప్పటికీ చంద్రబాబు వినకుండా అవినాశ్ కే టికెట్ ఇచ్చారు.

కానీ.. వైసీపీ అభ్యర్థి కొడాలి నాని చేతిలో ఘోరంగా ఓడిపోయారు అవినాష్. టీడీపీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసింది. తర్వాత టీడీపీకి చెందిన చాలామంది నేతలు బీజేపీలో చేరడం మొదలు పెట్టారు. మరికొందరు వైసీపీలోనూ చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో అవినాష్ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

తాజాగా… వైసీపీ నుంచి మంచి ఆఫర్ రావడంతో వెంటనే టీడీపీకి గుడ్ బై చెప్పి త్వరలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version