డైలాగ్ వార్: పవన్ తోపే…కానీ!

-

సినిమాల్లో అదిరిపోయే డైలాగులతో అభిమానులని అలరించే పవన్ కల్యాణ్…రాజకీయాల్లో కూడా అదే శైలిలో డైలాగులు వేసి…ప్రత్యర్ధులకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ప్రత్యర్ధులు లేరు అనుకోండి…వైసీపీ అనే ప్రత్యర్ధిపైనే పవన్ డైలాగులు వేస్తారు. ఈ మధ్య అధికార వైసీపీ నేతలు తమదైన శైలిలో చంద్రబాబు, పవన్ లపై విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశాల్లో గట్టిగానే ఫైర్ అయ్యారు.

దీంతో అటు టీడీపీ నేతలు, ఇటు జనసేన నేతలు సైతం…వైసీపీపై డైలాగ్ వార్ కు దిగారు. తాజాగా పవన్ సైతం వైసీపీపై విరుచుకుపడ్డారు. జనసేన పార్టీని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని బింకాలు పలకొద్దని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన పవన్… “ఇది మారిన కాలం. జనసేన కోసం జనం ఎదురుచూస్తున్న కాలం. మీరు ఎవరూ మామ్మల్ని ఆపలేరు’’ అంటూ డైలాగ్ వేశారు. బాధ్యతలు మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత నేర్పిస్తామని..ఇంకా వెంట్రుక పీకలేరంటూ ప్లీనరీ సమయంలో వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై పవన్‌ సెటైర్ వేశారు… కేశ సంపద చాలా విలువైందని, దాన్ని ప్రతిసారి పీక్కోకండని అన్నారు.

అలాగే “సింహాసనం ఖాళీ చేయండి. ప్రజలు వస్తున్నారు’’ అని చెప్పిన లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ వ్యాఖ్యలని…పవన్ డైలాగుల రూపంలో చెప్పేశారు. అయితే పవన్ డైలాగులు చెప్పడంలో తోపే అని చెప్పొచ్చు…అందుకే రాజకీయాల్లో కూడా అదిరిపోయే పంచ్ డైలాగులు వేస్తున్నారు. కాకపోతే ఈ డైలాగులు నిజం చేయాలంటే పవన్ కు చాలా కష్టమని చెప్పొచ్చు.

ఉదాహరణకు సింహాసనం ఖాళీ చేయండి. ప్రజలు వస్తున్నారని అన్నారు..అంటే వైసీపీని…అధికారం నుంచి దిగిపోమని, ఇంకా తాము అధికారంలోకి రాబోతున్నామనేది పవన్ డైలాగుకు అర్ధం…అయితే ఆ డైలాగ్ నిజం అవుతుందా? అంటే చాలా కష్టమని చెప్పొచ్చు..ఎందుకంటే జనసేనకు సింగిల్ గా అధికారంలోకి వచ్చే సత్తా లేదు…ఒకవేళ టీడీపీతో కలిసి…గెలిస్తే సింహాసనం ఎక్కేది చంద్రబాబు..లేదంటే మళ్ళీ జగన్ సింహాసనం ఎక్కుతారు…మరి ఇక్కడ పవన్ సింహాసనం అధిష్టించడం కష్టమే కదా!

Read more RELATED
Recommended to you

Exit mobile version