పార్టీ మీద అధినేతకే పట్టు లేదట.. స్థానిక నేతలను సంప్రదించకుండానే ఇన్చార్జిలను మార్చేస్తున్నారని కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు.. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో జనసేన నేతలు చర్చించుకుంటున్న మాటలు ఇవే..
ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన కనీసం ప్రాబల్యం కూడా చూపలేక పోతుంది.. అధినేతకు పార్టీలో పట్టు లేకపోవడం.. నాయకుల బలాబలాలు తెలియక పోవడంతో.. టిడిపి నేతల మార్గదర్శకంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.. పిఠాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు గందరగోళంలో ఉన్నారట.. స్థానిక నేతలతో మాట్లాడకుండానే వారిని సంప్రదించకుండానే..
పిఠాపురం ఇన్చార్జిగా ఉన్న శేషు కుమారుని తొలగించి.. ఉదయ్ శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించడం పై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.. పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి యాత్ర ఖర్చు ఎంత ఉదయ్ శ్రీనివాస్ భరించడంతోనే ఆయనకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారని పార్టీలో టాక్ నడుస్తోంది.. పిఠాపురం నియోజకవర్గ టికెట్ ఆశించి పార్టీలో చేరిన పిల్ల శ్రీధర్ దంపతులు కూడా పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చారట..
ఇటీవల నియోజకవర్గం పై సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్ సైతం ఉదయ్ శ్రీనివాస్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారట.. ఇదే సమయంలో ఉదయ్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసేందుకు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిన కేడర్ను సైతం ఆయన పట్టించుకోలేదని పాత తరం నేతలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది.. కాకినాడలో నివాసం ఉంటున్న ఉదయ్ శ్రీనివాస్ ను పిఠాపురం ఇన్చార్జిగా ఎలా నియమిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.. పక్క నియోజకవర్గాల్లో ఉండే వ్యక్తులు తమపై ఆధిపత్యం చలాయిస్తే చూస్తూ ఊరుకోమని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయాలపై కనీస అవగాహన లేదనే చర్చ పిఠాపురం జనసేనలో జోరుగా జరుగుతుంది.. మొత్తంగా ఉభయగోదావరి జిల్లాలో తమకు తిరుగు లేదని చెబుతున్న జనసేనకు.. క్షేత్రస్థాయిలో అడుగడుగునా అడ్డంకులే కనిపిస్తున్నాయి..