అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారతంలో లభించిన ఘనస్వాగతం గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపిన ట్రంప్ పర్యటన చివరికి విజయవంతంగా ముగిసింది. అలాగే భారతదేశాన్ని… మోడీని మరియు ఇక్కడి ప్రజలను విపరీతంగా పొగిడేశాడు ట్రంప్. దాదాపు మూడు బిలియన్ డాలర్ల డీల్ చేసుకున్న అమెరికా అధ్యక్షుడు ముఖ్యంగా నరేంద్ర మోడీని అయితే ఆకాశానికి ఎత్తేశాడు.
అయితే అదే సమయంలో దురదృష్టవశాత్తు చాలా ఘోరమైన రీతిలో ఢిల్లీలో అల్లర్లు జరిగిన విషయం కూడా తెలిసిందే. ఈ విషయం కాస్తా ఐక్యరాజ్యసమితి వద్దకు వెళ్లగా దాని జనరల్ సెక్రటరీ ఆంటోనియో ఈ విషయం పై తాజాగా స్పందించారు. ముందుగా మృతులకు సంతాపం తెలిపిన ఆయన అల్లర్లను నియంత్రించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అమెరికా ప్రతిపక్షనేత డెమోక్రటిక్ ఆంటోనియో సాండర్స్ అభ్యర్థి చెక్కిందే సందు అన్నట్లు ట్రంప్ పర్యటనపై విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఆయన డిల్లీలో పర్యటించడం అవసరమా అని అతనిని నిలదీశారు.
కాగా సాండర్స్ ప్రశ్నకు అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఢిల్లీ అల్లర్లకు కారణం మానవ హక్కులను కాపాడడం లో నాయకత్వ వైఫల్యమని ట్రంప్ అన్నారు. దీన్నిబట్టి అల్లర్లను అరికట్టడంలో మోడీ ఫెయిల్ అయ్యాడని ట్రంప్ చెప్పకనే చెప్పాడు. ఇక్కడ మోడీని విపరీతంగా పొగిడేసిన ఆయన తీరా అమెరికా వెళ్ళాక ఇలా అనేయడం చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు.