స్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం… టెన్నీస్ కోర్ట్ లో పరుగులు పెడుతుంటే అందం ఎక్కడ రాలిపోతుందో అనే ఆందోళన ఆమె అభిమానులది. డబుల్స్ ఆడుతుంటే ప్రత్యర్ధి ఆటగాడు ఆమె అందం చూసి ఎక్కడ ఆగిపోతాడో అనే కంగారు. అందంలో ఏ స్థాయిలో ప్రపంచాన్ని అలా కట్టి పడేసిందో… తన ఆట తీరుతో కూడా అదే విధంగా కట్టిపడేసింది. ఆమె ఆడుతుంటే చాలు టీవీ లకు అతక్కుపోయే వారు జనం.
ఫాక్స్ స్పోర్ట్స్ లాంటి సంస్థలు ఆమె ఆడుతుంటే వదిలేవి కాదు. స్కై స్పోర్ట్స్ అయితే ఆమె ఆట కోసం ఎంతగానో ఎదురు చూసి అవసరమైతే యాడ్స్ కూడా ఇచ్చేది కాదు. ఆమె ఎవరో కాదు టెన్నీస్ క్వీన్ మరియా షరపోవా. ఈ రష్యా అమ్మాయి ఇప్పుడు టెన్నీస్ నుంచి తప్పుకుంది. 13 ఏళ్ళకే సంచలనాలు నమోదు చేసి ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. 17 ఏళ్ళకే సెరెనా లాంటి క్రీడాకారిణిని ఓడించి టెన్నీస్ ప్రపంచానికి హెచ్చరికలు పంపింది.
34 సింగల్స్, 5 గ్రాండ్ స్లాం లు గెలిచి సంచలనాలు సృష్టించింది. ఆరేళ్ళ వయసులో షరపోవా రాకెట్ పట్టుకుంది. అక్కడి నుంచి ఆడిన ప్రతీ మ్యాచ్ లో కూడా ఆమె మార్క్ స్పష్టంగా కనపడేది. ప్రత్యర్ధి మీద ఆధిపత్యం. మ్యాచ్ ఆసాంతం అదే ఉత్సాహం… వీటికి తోడు అందం. ఆ అందం చూసి అప్పట్లో హాలీవుడ్ హీరోయిన్లు కూడా కుళ్ళుకునే వాళ్ళు అని చెప్తూ ఉంటారు. దిమిత్రోవా విషయంలో ఆమెకు విభేదాలు వచ్చాయి.
దిమిత్రోవా ను ముందు సెరెనా లవ్ చేయగా ఆ తర్వాత షరపోవా లవ్ చేసింది. దీనితో ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకునే వరకు వెళ్ళారు. అంతర్జాతీయ టెన్నీస్ యువనికపై అదో సంచలన వివాదం కూడా. ఇక a తర్వాత డోపింగ్ ఆరోపణలతో 15 నెలలు ఆటకు దూరమైంది. ఆ తర్వాత మళ్ళీ ఆమె రాకెట్ పట్టుకుంది. ఆ సమయంలో అయిన భుజం గాయం షరపోవా కెరీర్ ని ఒక్కసారిగా క్రుంగదీసింది.
ఆ తర్వాత మళ్ళీ టెన్నీస్ కోర్ట్ లోకి పట్టుదలగా అడుగుపెట్టింది. అయినా సరే ఆమె మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అయితే మునుపటి మాదిరిగా దూకుడు ప్రదర్శించలేకపోయింది. దీనితో ఇక ఆటకు గుడ్ బై చెప్పాలని భావించి. టెన్నీస్ కాకుండా హీరోయిన్ అయి ఉంటే దాదాపు మూడు దశాబ్దాల పాటు హాలీవుడ్ ని ఆమె ఏలి ఉండేది ఏమో. అవును ఆమె అందం అలాంటిది మరి.
కుర్ర కారు… మూతి మీద మీసం రాని వాడు షరపోవా ను తలుచుకునే వాడు. ఆటలో ఆమె ఒక దిగ్గజం. ఎందరో దిగ్గజాలు అందుకోలేని ఘనతలను చిన్న వయసులోనే అందుకుంది ఆమె. ఆట మీద ప్రేమతో ఆడింది. వివాదాలకు దూరంగా ఉండేది. తన తండ్రి కన్న కలలను ఆమె నెరవేర్చింది. ఈ 32 ఏళ్ళ రష్యా అమ్మాయి టెన్నీస్ రాకెట్ మీద తన అందాన్ని వదిలి వెళ్ళింది. 21 వారాల పాటు ఏటీసి నెంబర్ 1 ర్యాంకర్ గా ఉండటం ఆమె సాధించిన అరుదైన ఘనత.