స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి దాదాపు చాలా వరకు ఏకగ్రీవం స్థానాలు గెలుస్తూ రాణిస్తోంది. దీంతో టిడిపిలో ఉన్న నాయకులు కూడా చాలామంది వైసీపీ పార్టీ లోకి వెళ్లి పోతున్నారు. ఒకపక్క ఏకగ్రీవ స్థానాలు గెలవడం మరోపక్క పార్టీని చాలామంది విడిపోవడంతో చంద్రబాబుకి మైండ్ పోయినట్లు పరిస్థితి ఏర్పడిందని వార్తలు వస్తున్నాయి. ఇందువల్లనే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి మాచర్లలో తన పార్టీ నాయకుల చేత అక్కడ ఉన్న ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఆ యాక్సిడెంట్ వీడియోని చిత్రీకరించారని చంద్రబాబు రాజకీయంగా జగన్ ని ఎదుర్కోలేక పోతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
అదేమిటంటే దేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ కొద్దిగా తక్కువగా ఉండటంతో రాష్ట్రంలో ఎటువంటి కేసులు రాబోయే రోజుల్లో నమోదు కాకపోతే మళ్లీ ఎలక్షన్లు యధావిధిగా స్టార్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆలోచిస్తున్నట్లు అందుకే ఎలక్షన్ కోడ్ తీయ లేదన్నట్లు వార్తలు వస్తున్నాయి.