కేసీఆర్‌కు అదిరిపోయే షాకులు రెడీ చేసిన ఈటల…ఆ మంత్రంతో చెక్?

-

హుజూరాబాద్ ఉపఎన్నికలో కేసీఆర్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చిన ఈటల రాజేందర్..మున్ముందు కేసీఆర్‌కు ఇంకా సూపర్ షాకులు రెడీ చేసి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు ఇంకా దినదిన గండంగా మార్చనున్నారు. ఇక ఈటల రాజకీయంగా వేసే ప్రతీ స్టెప్ గులాబీ బాస్‌ గుండెల్లో గుబులు మొదలుపెట్టనుంది. ఇప్పటికే బీజేపీ..కేసీఆర్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతుంది. మరోవైపు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం తనదైన శైలిలో అధికార టీఆర్ఎస్‌కు చుక్కలు చూపిస్తున్నారు.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

అయితే ఈటల గెలుపుతో బీజేపీ రేసులో ముందుకొచ్చింది…ఇంకా రాను రాను కమలదళం.. గులాబీ దళానికి చుక్కలు చూపించేలా ఉంది. ఇక ఈటలని ఉపయోగించుకుని గులాబీ బాస్‌కు చుక్కలు చూపించాలని కమలనాథులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఈటలతో బీసీ మంత్రాన్ని ప్రయోగించనున్నారు. బీసీ నేతగా ఉన్న ఈటల ద్వారా… తెలంగాణలోని బీసీలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేయనుంది.

అసలు తెలంగాణలో బీసీ ఓటర్లు అధికంగా ఉంటారనే సంగతి తెలిసిందే. వారే గెలుపోటములని డిసైడ్ చేస్తారు. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా ముందు బీసీలని ఆకట్టుకోవడానికే ప్రయత్నిస్తుంది. గతంలో టీడీపీ ద్వారా బీసీలకు ఎక్కువ న్యాయం జరిగింది. అందుకే బీసీలు ఎక్కువగా టీడీపీకి మద్ధతుగా ఉండేవారు. కానీ టీడీపీని తోక్కేసి కేసీఆర్ బీసీలని తమవైపుకు తిప్పుకుని రెండుసార్లు అధికారంలోకి వచ్చారు.

కానీ ఈటల గెలుపుతో బీసీల్లో చీలిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈటల రాష్ట్రమంతా తిరిగి బీసీలని బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేయనున్నారు. ఇదే విషయం కాంగ్రెస్ కూడా గమనిస్తుంది. బీజేపీ… ఈటలను ఇకపై రాష్ట్రమంతా తిప్పుతూ బీసీలని లాగేసే ప్రయత్నం చేస్తుందని, ఇది కాంగ్రెస్‌కు ప్రమాదకరమని కాంగ్రెస్ బీసీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ కంటే ముందు అలెర్ట్ అయ్యి, బీసీలని కాంగ్రెస్ వైపుకు తిప్పుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఈటల ప్రభావం బీసీలపై ఎక్కువ ఉంది… అలాగే దళితబంధు వల్ల బీసీలు టీఆర్ఎస్‌కు ఇంకా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో ఈటల… బీసీ మంత్రంతో కేసీఆర్‌కు అదిరిపోయే షాక్ ఇవ్వొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version