ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జగన్ ఎవరిని నమ్మడం లేదా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. మూడు రాజధానుల ప్రకటన వచ్చిన నాటి నుంచి జగన్ ప్రకటనలు చేయడం, దాని విషయంలో ముందుకి వెళ్ళడమే గాని ఇప్పటి వరకు ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టి అనుమానాలను నివృత్తి కూడా చేయలేదు. మంత్రులు పేర్ని నాని, బొత్సా సత్యనారాయణ లేదా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడటమే గాని,
జగన్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇక ఈ విషయంలో ఆయన ఎం చేస్తున్నారు…? ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఎవరికి ఏ స్పష్టతా రావడం లేదు. అసలు సిఆర్దియే బిల్లుని రద్దు చేస్తారా…? సిఆర్దియే బిల్లుని అసెంబ్లీలో మనీ బిల్లుగా పెట్టాలా అనేది కూడా ఎవరికి స్పష్టత లేదు. ప్రస్తుతం సిఆర్దియే రద్దు ఉంటుందా…? ఉపసంహరణకు మాత్రమే పరిమితం చేస్తారా…?
కేబినేట్ మీటింగ్ ప్రీపోన్ పోస్ట్ పోన్ ఎందుకు అవుతుంది…? అసలు ఆ మీటింగ్ లో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఎవరికి స్పష్టత రావడం లేదు. ఈ విషయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, కొందరు సీనియర్ మంత్రులతో సహా ఎవరితో కూడా ఆయన చర్చించడం లేదు. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళతో మాట్లాడి౦చడమే గాని ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు.
కనీసం రాజధాని జిల్లాలు అయిన కృష్ణా గుంటూరు జిల్లాల మంత్రులకు ఎం జరుగుతుందో తెలియడం లేదు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి జగన్ కి అత్యంత నమ్మకస్తులు. వాళ్ళతో మాత్రమే జగన్ మాట్లాడుతున్నారు గాని ఈ విషయంలో సీనియర్ ఎమ్మెల్యేలకు కూడా సమాచారం అనేది లేదు. కనీస సమాచారం లేకుండా చేస్తున్నారట ముఖ్యమంత్రి.