దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా… పవార్ పవర్ పాలిటిక్స్ ముందు నిలబడలేకపోయిన కమలం…!

-

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇప్పుడు క్షణానికో మలుపు తిరుగుతూ ఉత్కంటను రేకెత్తిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి పదవికి, ఉప ముఖ్యమంత్రి పదవికి హడావుడిగా రాజీనామా చేసిన… దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ చేతులు ఎత్తేసారు. బలపరీక్షకు ముందే ఈ ఇద్దరు చేతులు ఎత్తేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే… అజిత్ పవర్ తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు… ముందు తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు వస్తారని అంచనాలు వేసిన ఆయన,

ఆ తర్వాత పది మంది కూడా ఆయన వెంట లేకపోవడంతో శరద్ పవార్ తోనే ఎమ్మెల్యేలు అందరూ ఉండటంతో… రాజీనామా చేసారు. దీనితో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. కాసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా.. శివసేనపై తీవ్ర విమర్శలు చేసారు. మహారాష్ట్ర ప్రజలు బిజెపికి మద్దతు ఇచ్చారని… ప్రీపోల్ పొత్తు కుదుర్చుకున్న తర్వాత శివసేన తమను మోసం చేసిందని మండిపడ్డారు. శివసేన కోసం చాలా రోజులు ఎదురు చూసామని ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన బేరసారాలకు దిగిందని ఆరోపించారు.

రాష్ట్రపతి పాలన వద్దనే అజిత్ పవార్ తమతో చేతులు కలిపారన్నారు. సంఖ్యా బలం లేదనే ఆయన రాజీనామా చేసినట్టు వివరించారు. ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజుల్లోనే ఆయన రాజీనామా చేయడం విశేషం. అజిత్ పవార్ ఆ నిర్ణయం తీసుకున్న కాసేపటికే ఫడ్నవీస్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. బుధవారం మహారాష్ట్రలో బలపరీక్ష జరగనుంది. ఈ నేపధ్యంలో ఏ విధంగా బలపరీక్షలో నెగ్గాలి అనే దానిపై ఉదయం నుంచి సమాలోచనలు జరిపారు ఫడ్నవీస్… అయినా సరే ఫలితం లేకుండా పోయింది.

ఉప ముఖ్యమంత్రిగా 78 గంటలు పదవిలో ఉన్న అజిత్ పవార్ అనూహ్యంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలోనే ఆయన 9 ఇరిగేషన్ స్కాం ల నుంచి ఊరట లభించింది. ముందు శరద్ పవార్ ని తక్కువ అంచనా వేసిన బిజెపి… ఎమ్మెల్యేలు అందరూ ఆయన మాట వినడం… శివసేన, కాంగ్రెస్ కూడా ఆయనకే బాధ్యతలు వదిలేయడంతో గ్రాండ్ హయత్ హోటల్ కు… ఎమ్మెల్యేలను తీసుకువెళ్ళి పరేడ్ చేయించారు. జాతీయ మీడియా కూడా అక్కడ ఉంది… దీనితో అధికారం విషయంలో శరద్ పవార్ తో బిజెపి నిలబడలేకపోయింది అనే విషయం స్పష్టమైంది… ఢిల్లీలో సమావేశమైన బిజెపి అగ్రనేతలు ఫడ్నవీస్ కి రాజీనామా చెయ్యాలని ఆదేశించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version