భారతీయ రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితమే దక్షిణ మధ్య రైల్వే-సికింద్రాబాద్ 4103 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈశాన్య రైల్వే మరో 1104 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితోపాటు సంబంధిం విభాగంలో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. . దరఖాస్తుకు 2019 డిసెంబర్ 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ner.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు- 1104, ఫిట్టర్- 494, వెల్డర్- 121, ఎలక్ట్రీషియన్- 99, పెయింటర్- 106, మెషినిస్ట్- 1, టర్నర్-15, మెకానిక్ డీజిల్- 85, ట్రిమ్మర్- 8.
అర్హత: 50 శాతం మార్కులతో పదోతరగతి అర్హతతోపాటు.. సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 25
శిక్షణ ప్రారంభం- 2020 ఏప్రిల్ 1
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.