చ‌రిత్ర‌ను అడ్డుపెట్టి.. జ‌గ‌న్ పాల‌న‌కు మ‌సిపూసే య‌త్నం.. ఏం జ‌రుగుతోంది…?

-

ఏపీలో వైసీపీ పాల‌న ప్రారంభమై.. ప‌ట్టుమ‌ని ప‌దిమాసాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. అయితే, ఆయ‌న పా లనను,  వైసీపీ విజ‌యాన్ని జీర్ణించుకోలేక పోతున్న ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు అనేక రూపాల్లో జ‌గ‌న్ ప్ర‌బుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇక‌, ఆ పార్టీ అనుకూల మీడియా కూడా జ‌గ‌న్ పై అనే క వార్తల‌ను వండి వార్చింది. అయితే, ఇప్పుడు అటు టీడీపీ ఇటు దాని అనుకూల మీడియా రెండు కూడా రూటు మార్చాయి. అదేంటంటే.. జ‌గ‌న్‌కు పాల‌న చేత‌కాదు! అనే ముద్ర‌ను వేసేందుకు ప్ర‌యాస‌ప‌డుతు న్నాయి. ఈ క్ర‌మంలోనే అనేక వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు సాగుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఇట‌వ‌ల కాలంలో జ‌గ‌న్ పాల‌న విష‌యాల‌ను, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల‌ను , వాటిపై కోర్టుల్లో వ‌చ్చిన తీర్పుల‌ను ఉటంకిస్తూ.. పుంఖాను పుంఖాలుగా వ్య‌తిరేక వార్త‌ల‌ను వండి వార్చాల‌ని నిర్ణ యించాయి. నిజానికి ఏ పాల‌కుడైనా.. ముందు అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితిని, ప్ర‌జ‌ల మూడ్‌ను గుర్తించి దాని ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకుంటారు. అయితే, ప‌రిస్థితులు వెనువెంట‌నే మారిపోతాయి. ఉదాహ‌ర‌ణ‌కు రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డిలోనే ఉంద‌ని, స్థానిక ఎన్నిక‌లు జ‌రిపితే బాగుంటుంద‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.

అయితే, దీనికి సుప్రీం కోర్టు వ‌ప్పుకోక‌పోవ‌డం, ఆ వెంట‌నే క‌రోనా తీవ్ర‌త పెర‌గ‌డంతో జ‌గ‌న్ త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు. అదేవిధంగా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల విష‌యంలోనూ జ‌గ‌న్ ఆలోచ‌న ఒక‌విధంగా ఉంది. ఇప్ప‌టికే విద్యార్థులు రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి చదివారు కాబ‌ట్టి.. ఇక‌, ఇప్పుడు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయ‌డం స‌రికాద‌ని భావించా రు. అయితే, క‌రోనా తీవ్రం గా ఉండ‌డంతో ఆయ‌న ఈ విష‌యంలోనూ వాయిదా వేయాల‌ని భావించారు. అ యితే, వీటిని పెద్ద త‌ప్పులుగా, జ‌గ‌న్కు పాల‌న చేత‌కాద‌నే త‌ర‌హాలో ప్ర‌చారం చేసేందుకు అటు ప్ర‌తిప క్షం, ఇటు దాని అనుకూల మీడియా కూడా ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అయితే, ఇక్క‌డే ఒక విష‌యం గ‌మ‌నించాలి గ‌తంలో చంద్ర‌బాబు కూడా అనేక విష‌యాల్లో త‌ప్పులు చేసి.. స‌రిదిద్దుకున్న ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసేది లేద‌న్నారు. కానీ, హైకోర్టు వాయిదా వేయాల‌ని భీష్మించింది. దీంతో త‌ప్ప‌లేదు. ఏ ప్ర‌భుత్వానికైనా కొన్ని తీపులు, చేదులు, వ‌గ‌ర్లు.. కామ‌నే!!

Read more RELATED
Recommended to you

Exit mobile version