కాంగ్రెస్ లో ఎప్పుడు ఎలాంటి రాజకీయం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆ పార్టీ నేతలు ఎప్పుడు కలిసి ఉంటారో..ఎప్పుడు గొడవలు పడతారో అర్ధం కాదు. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కొందరు నేతలు సీట్ల కోసం ప్రయత్నాలు పోటీ పడుతున్నారు. మరికొందరు తమ ఆధిపత్యం కొనసాగించేలా రాజకీయం నడిపిస్తున్నారు. ఇలా ఎవరి దారిలో వారు ఉన్నారు.
ఇక కాంగ్రెస్ లో కొందరు సీనియర్లు తమ ఫ్యామిలీలకు సీట్లు దక్కించుకునే పనిలో ఉన్నారు. సాధారణంగా కాంగ్రెస్ లో ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కువగానే ఉంటుంది. ఫ్యామిలీ ప్యాకేజ్ మాదిరిగా సీట్లు దక్కించుకోవడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో అదే బాటలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇక ఇందులో మొదట ఉత్తమ్ కుమార్ రెడ్డి..తనతో పాటు తన భార్యకు సీటు కోసం పట్టుబడుతున్నారు. హుజూర్‌నగర్, కోదాడ సీట్లపై ఉత్తమ్ ఫోకస్ ఉంది. అయితే ఇటీవల ఉత్తమ్ పార్టీ మారతారనే ప్రచారం వచ్చింది. తాను పార్టీ మారే ఛాన్స్ లేదని, పార్టీలో ఓ వర్గం ఇలా ప్రచారం చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఉత్తమ్ ఫ్యామిలీకి రెండు సీట్లపై ఇంకా క్లారిటీ రాలేదు.
అటు జానారెడ్డి సైతం రెండు సీట్లు కోసం ట్రై చేస్తున్నారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ సీట్లు దక్కించుకోవాలని చూస్తున్నారు. సాగర్ గ్యారెంటీ గాని ఇంకా మిర్యాలగూడపై క్లారిటీ లేదు. ఇక కొండా సురేఖ ఫ్యామిలీ సైతం మూడు సీట్లు అడుగుతుంది. పరకాల, వరంగల్ ఈస్ట్, భూపాలపల్లి లేదా పాలకుర్తి సీట్లు ఆశిస్తున్నారు. అయితే పరకాల, వరంగల్ ఈస్ట్ సీట్లు గ్యారెంటీ అని తెలుస్తోంది.
మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవిలకు సీట్లు ఫిక్స్. మొత్తానికి కాంగ్రెస్ ఫ్యామిలీ ప్యాకేజ్ కొందరికే దక్కేలా ఉంది.