అనుకున్నట్టే తిరుపతి ఉప ఎన్నికల్లో ఫ్యాను సునామీ సృష్టిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పినట్టు విజయం వైపు దూసుకెళ్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. ఇక ఇప్పటి వరకు 4,27,401 ఓట్ల మార్కును వైసీపీ అభ్యర్థి గురుమూర్తి దాటేశారు. టీడీపీ, బీజేపీ డీలా పడ్డాయి.
ముందు నుంచి గెలుపు దిశగానే వెళ్తున్న వైసీపీ ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యం ప్రదర్శించింది. రౌండ్ రౌండ్ లోనూ దూసుకెళ్తోంది. ఏ రౌండ్ లోనూ ఎవరికీ అవకాశం ఇవ్వకుండా పట్టు సాధిస్తోంది. ఇప్పటి వరకు ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికే వైసీపీ అందనంత ఎత్తులో నిలుచుంది. ఇక టీడీపీకి 2,40,020ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి కేవలం 40,743ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇక వైసీపికి 1,95,456ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఎవరికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు అధికార పార్టీ. అయితే కౌంటింగ్ కుముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోర్టు కూడా కౌంటింగ్ ఆపేది లేదంటూ తీర్పు ఇవ్వడంతో వైసీపీకి కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక మరి కొద్ది సేపట్లో పూర్తి ఫలితాలు రానున్నాయి.