రైల్వే జోన్ కోసం రూ. 300 కోట్లు వ‌చ్చే అవ‌కాశం : ఎంపీ స‌త్య‌వ‌తి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి త్వ‌ర‌లో నే ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైఎస్ఆర్సీపీ ఎంపీ
సత్యవతి అన్నారు. తాను ఈ రోజు పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో విభ‌జ‌న హామీ ల లో భాగం గా ఉన్న రైల్వే జోన్ అంశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ముందు ప్ర‌స్తావించానని అన్నారు. ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్ పై కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి కే ప్ర‌కట‌న చేసింద‌ని గుర్తు చేశారు. అంతే కాకుండా ప్ర‌స్తుతం రైల్వే జోన్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం రూ. 300 కోట్లు విడుద‌ల చేయ‌డాని కి సిద్ధం గా ఉంద‌ని అన్నారు.

దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా సిద్దం అయింద‌ని తెలిపారు. అయితే కొంత మంది కావాల‌నే రైల్వే జోన్ పై అనవసరం గా ప్ర‌జ‌ల‌ను అయోమయం కు గురి చేస్తున్నార‌ని అన్నారు. అలాగే రాష్ట్రం లో ఉన్న వాల్తేరు డివిజన్ ను ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్ లో కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నామ‌ని ప్ర‌ట‌కించారు. త‌మ ప్ర‌భుత్వం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయ‌డానికి కృషి చేస్తుంద‌ని అన్నారు. అలాగే ఏపీ కి కేంద్రం కూడా అన్ని రకాల సహాయం చేయాలని కోరారు. అలాగే రైతుల కోసం కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరాన‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version