సీనియర్ పోలిటీషన్ హరిరామ జోగయ్య ఇప్పుడు పవన్ ను ర్యాగింగ్ చేస్తున్నారు.కాపుల్లో పవన్ కి ఉన్న ఇమేజ్ ని తవగించాలనే లక్ష్యంతో ఆయన ఈ కామెంట్స్ చేయడమే కాదు బహిరంగ లేఖలను విడుదల చేస్తున్నారు. రామా కృష్ణా అనుకునే వయసులోనూ పవన్ ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. కేవలం ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని చెపుకునే పవన్ ని చేగొండి హరిరామ జోగయ్య చెడుగుడు ఆడేస్తున్నారు. కాపుల పక్షాన పోరాడే ఈ వెటరన్ పోలిటీషన్ కాపుల జోలికి ఎవరు వచ్చినా వాళ్ళ కు తగిన బుద్ధి చెప్తుంటారు. కాపులను మోసం చేయాలని చూసిన వాళ్ళని ఏమాత్రం సహించకుండా చీల్చి చెండాడేస్తారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయ్యి ఉండీ కాపులను మోసం చేస్తున్న పవన్ కి ఇప్పుడు హరిరామ జోగయ్య చేతిలో చీవాట్లు తినే అదృష్టం దక్కింది. కాపులకు ప్రాధాన్యం దక్కాలని కోరుకునే ఈ సీనియర్ ఇటీవల జనసేనకు కనీసం 60 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ రాసారు. పొత్తులో భాగంగా ఓ పాతిక ఇరవై సీట్లు చంద్రబాబు ఇస్తాడేమో అని జనసైనికులు భావిస్తున్న తరుణంలో మాకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ మొన్న జోగయ్య రాసిన లేఖ చర్చనీయాంశమయింది . కాపులు దాదాపు 50 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారని, వారికి ప్రాధాన్యం ఇవ్వనప్పుడు చంద్రబాబు
వెంట ఎందుకు వెళ్లాలని, ఆయనకు ఎందుకు ఊడిగం చేయాలనీ ప్రశ్నిస్తూ జోగయ్య లేఖ రాసారు.
చంద్రబాబుతో వదిలేయకుండా ఇప్పుడు పవన్ ను సైతం ఆయన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
నిన్ను ఎక్కడికో తీసుకుపోదామని మేము అనుకుంటున్నాం.. కానీ మీరు అక్కడికి రారు.. ఇక్కడే ఉంటాను అంటారు. ఇలా ఐతే ఎలా అని ప్రశ్నించారు.అసలు ఆ కూటమికి చంద్రబాబే నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి అంటూ మొన్న లోకేష్ సైతం ప్రకటించారు. అలా లోకేష్ ప్రకటించాక కూడా చంద్రబాబు వెంట వెళ్తారా ? అంటూ జోగయ్య పవన్ ను ప్రశ్నించారు.అసలు మీరు జనసేన అనే పార్టీ కి అధిపతా లేక చంద్రబాబుకు తబేదారుగా ఉండేందుకు వచ్చారా అని ప్రశ్నలను సంధించారు.బానిసత్వాన్నే కోరుకుంటే మీకు అసలు అస్తిత్వం లేదా అని నిలదీశారు. కాపుల ఆత్మ గౌరవాన్ని కాపాడలేని మీకు రాజకీయ పార్టీ ఎందుకు నిలదీశారు. జోగయ్య స్పీడ్ చూస్తుంటే పవన్ ని ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు.