మాజీమంత్రి ముద్రగ పద్మనాభంపై మండిపడ్డారు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామజోగయ్య.పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.ఈ రోజుతో ముద్రగడపై తనకున్న అభిమానం పూర్తిగా పోయిందన్నారు. అంతేకాదు కాపు సామాజిక ఓట్లను వైసీపీకి కట్టబెట్టేందుకు పద్మనాభం రెడీ అయ్యారంటూ చురకలు అంటించారు. పవన్‌ని విమర్శించడం వలన ఎలాంటి లభం లేదని చెప్పిన ఆయన…ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి సపోర్ట్‌గా ముద్రగడ మాట్లాడటాన్ని తప్పుబట్టారు. అవినీతి పార్టీలో చేరేందుకు ముద్రగడ సిద్ధమయ్యారని విమర్శించారు.
జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ మంగళవారం ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.దీనిపై కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరి రామజోగయ్య స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు.కాపుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ముద్రగడ పై తనకున్న సదభిప్రాయం పోయిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.పదువులు ఆశించి కాపు సామాజిక వర్గాన్ని జగన్ కు తాకట్టు పెట్టే కొందరి కాపు నాయకుల లిస్ట్‌లో ముద్రగడ కూడా చేరిపోయారని అన్నారు. గతంలో కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ ఉద్యమాలు చేశారు.ఆ ఉద్యమాలన్నీ చిత్త శుద్ధితో చేసినట్లు తాను నమ్మానని జోగయ్య అన్నారు.పవన్‌పై ఆయన చేసిన విమర్శలు చూస్తుంటే ఉద్యమ ప్రయత్నాలన్నీ రాజకీయ లబ్ధి కోసమే చేసినట్లు తేలిపోయిందన్నారు. ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్ తన పరిధిలో లేదంటూ బీసీ లను ఆకర్షించిన సీఎం జగన్ ను అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని సెటైర్ వేశారు.2019 ఎన్నికలలో తెర వెనుక ముద్రగడ వైసీపీకి మద్దతు పలికారని జోగయ్య ఆరోపించారు. జనసేన పార్టీ కి ఓట్లు పడకుండా చేశారని ఆగ్రహం చెందారు.కాపుల కోసం చేపట్టిన ఉద్యమం మధ్యలో రాజీనామా చేసి ఉద్యమాన్ని గంగలో కలిపింది ముద్రగడేనని తీవ్రస్థాయిలో విమర్శించారు.
పవన్ కల్యాణ్‌పై ఆభాండాలు వేయడం వలన ఏమి వస్తుందని ముద్రగడను ప్రశ్నించిన హరిరామజోగయ్య రాజకీయాలను చెడగొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. అవినీతిపరుడైన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి మద్దతుగా ముద్రగడ నిలబడటం సిగ్గు చేటన్నారు.కాకినాడలో పవన్ ను పోటీ చేసి గెలవమని సవాలు విసిరడం కాదు.., ముందు ప్రత్తిపాడు లో ముద్రగడ నిలబడి గెలుపొంది చూపించాలని సవాల్ విసిరారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ పంచన చేరి కాపులకు ఉన్న పరపతిని చెడగొట్టవద్దని హితవు పలికారు.అలాగే తన పరపతి కూడా పోగొట్టుకోవద్దని సూచించారు.పాలనలో విఫలమై రాష్ర్టాన్ని అప్పుల్లోకి నెట్టిన ముఖ్యమంత్రి జగన్ ను వెనకేసుకొస్తున్న పద్మనాభం ఏదో ఆశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని,ఇలాంటి పనికిమాలిన పనులు మానుకుని నోరుమూసుకుని కూర్చుంటే అందరూ సంతోషిస్తారని సెటైర్‌లు వేశారు.