ఎట్టకేలకు ఉపాసన,రాంచరణ్ తల్లిదండ్రులయ్యారని చెప్పాలి. నిన్న ఉపాసన తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ శుభవార్తను ఉపాసన రాంచరణ్ దంపతులు ఎప్పుడెప్పుడు తమతో తెలియజేస్తారా అని మెగా అభిమానులు కూడా పదేళ్లుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఎన్నోసార్లు మీడియా సమక్షంలో కూడా మెగా కాంపౌండ్ కి ఈ ప్రశ్నలు ఎదురయ్యాయని చెప్పవచ్చు. ఇక అలాంటి ప్రశ్నల మధ్య గత ఏడాది డిసెంబర్ 12న మొదటిసారి గుడ్ న్యూస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఇది ఇలా ఉండగా, తాజాగా తమ ఇంటికి వచ్చిన వారసురాల్ని లిటిల్ మెగా ప్రిన్సెస్ గా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. నీ రాకతో మెగా ఫ్యామిలీ అమితానందాన్ని పొందుతోంది అంటూ చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది. అయితే, తాజాగా చరణ్ – ఉపాసనలకు పుట్టిన ఆడ పిల్ల కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.