నేడు ఝార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక భేటీ.. విశ్వాస పరీక్షలో సొరేన్ నెగ్గేనా..?

-

ఇవాళ ఝార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తన బలాన్ని నిరూపించుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలను భద్రంగా కాపాడుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రిసార్టులో క్యాంపు వేసిన అధికార కూటమి (యూపీఏ) ఎమ్మెల్యేలు తాజాగా స్వరాష్ట్రానికి చేరుకున్నారు. రాయ్‌పుర్‌ నుంచి ఆదివారం మధ్యాహ్నం ఛార్టెడ్‌ విమానంలో 30మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు రాంచీకి చేరుకున్నారు. తాజాగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అవుతున్నందున రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను సొంత రాష్ట్రానికి తీసుకువచ్చింది.

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శాసనసభ సభ్యత్వంపై వేటు పడనుందని గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపించినా ఆ రాష్ట్ర గవర్నర్‌ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారపక్షం ఆరోపిస్తోంది. ఆలస్యం చేస్తుందంటే అక్కడ ఏదో ప్లాన్‌ వేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌కు యూపీఏ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అయితే, వారికి నెలకొన్న అనుమానాలకు త్వరలోనే స్పష్టత ఇస్తానన్న గవర్నర్‌ రమేష్‌ బైస్‌.. శుక్రవారం దిల్లీ వెళ్ళారు. రాజ్‌భవన్‌ వర్గాలు మాత్రం ఆయన వ్యక్తిగత పర్యటన మీద దిల్లీకి వెళ్లినట్లు పేర్కొన్నాయి. యూపీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తోందనే అధికార కూటమి ఆరోపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version