3 నెల‌ల్లో పంచాయితీ ఎన్నిక‌లు జ‌ర‌పండి : హైకోర్టు ఆదేశం

-

ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పంచాయతీల కాల పరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించేలా ఏపీ ప్రభుత్వం ఇటీవల జీవో 90ని తీసుకొచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల పాలన వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

శుభ‌ప‌రిణామం- ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌
ఏపీలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే 3నెలల్లో ఎన్నికలు జరగాలన్నారు. స్థానిక సంస్థల అధికారాలు నిలబెట్టేలా హైకోర్టు ఆదేశాలుండటం శుభపరిణామని మీడియాతో అన్నారు. పంచాయితీరాజ్ చట్టాన్ని నవ్వులపాలు చేసేలా జీవో.. 90 ఉందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version