కౌంట్‌ డౌన్ స్టార్ట్… 22 రౌండ్లు.. డిసైడింగ్ ఓట్లు అవే?

-

హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి కొన్ని గంటల్లో కౌంటింగ్ మొదలు కానుంది. 2 హళ్ళు…14 టేబుళ్లు…22 రౌండ్లలో హుజూరాబాద్ రిజల్ట్ తెలబోతుంది. ఇక ముందు పోస్టల్ బ్యాలెంట్ కౌంటింగ్ మొదలవుతుంది. ఒక్కో రౌండులో 14 ఈవీఎంలలో పోలైన ఓట్లని లెక్కించనున్నారు..ఇలా 22 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది…అయితే హుజూరాబాద్ ఫలితం ముందు రౌండ్లలోనే తేలడం చాలా కష్టమని తెలుస్తోంది.

Huzurabad | హుజురాబాద్

ఎందుకంటే రౌండ్‌కు రౌండ్‌కు లీడింగ్ మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుబ్బాక ఉపఎన్నిక మాదిరిగానే…చివరి రౌండ్ వరకు ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఓ వైపు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ శ్రేణులు ధీమాగా ఉన్నాయి…మొదట్లో గెలుపుపై బాగా ధీమాగా ఉన్నారు…దాదాపు 20 వేల ఓట్ల పైనే మెజారిటీ వస్తుందని వారు భావించారు…తీరా పోలింగ్ అయ్యేసరికి సీన్ మారిందని అర్ధమైంది…గెలిస్తే 5 వేల ఓట్ల లోపు మెజారిటీతోనే గెలవడం జరుగుతుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.

అటు ఈటల రాజేందర్ గెలుపుపై బీజేపీ శ్రేణులు మొదట నుంచి ధీమాగానే ఉన్నాయి. మొదట్లో భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నారు…కానీ పోలింగ్ సమయానికొచ్చేసరికి కాస్త పరిస్తితులు మారినట్లు కనిపిస్తున్నాయి. కానీ ఏది ఎలా జరిగినా ఓ 10 వేల ఓట్ల మెజారిటీతో ఈటల గెలుపు ఖాయమని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.

అయితే సర్వేలు కూడా పూర్తిగా ఒకరికి మొగ్గు చూపించలేదు. దీంతో హుజూరాబాద్ ప్రజల నాడి ఎవరికీ అర్ధం కావడం లేదు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఓట్లు వేసిన వారి నాడి అందడం లేదని తెలుస్తోంది. సైలెంట్‌గా ఓట్లు వేసి వచ్చేసి…వారు ఎవరికి ఓటు వేశారో కూడా బయటకు చెప్పడం లేదని తెలుస్తోంది. దాదాపు 10 శాతం మంది సైలెంట్ ఓటర్లు ఉన్నారు. వారే గెలుపోటములని డిసైడ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక హుజూరాబాద్‌లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే…మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version