Raja Vikramarka Trailer: దీపావళిని గ్రాండ్‏గా ప్లాన్ చేసిన “రాజా విక్రమార్క”.. సీమ‌టపాకాయ‌లా పేలిన‌ ట్రైలర్

-

Raja Vikramarka Trailer: ఆర్ఎక్స్ 100 సినిమా తో భారీ విజయాన్ని అందుకున్నయంగ్ హీరో కార్తికేయ. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‏గా మారాడు. కానీ ఆ తర్వాత సరైన హిట్టు అందుకోలేక పోయాడు. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో విజ‌యం అందుకోలేదు. ఎలాగైనా.. హిట్ కొట్టాల‌ని ఇప్పుడు రాజా విక్రమార్క అనే మరొక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

యాక్షన్ థ్రిల్లర్ తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ప్ర‌క‌టించిన రోజు నుంచే.. పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రంతో కార్తికేయ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించేలా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వెలువ‌డింది. ఈ మూవీ ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే.. హోమ్ మినిస్టర్ కూతురు ని ప్రేమలోకి దింపి.. హోమ్ మినిస్టర్ ఎదురింట్లోనే దొంగతనం చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్న‌ట్టు కార్తికేయ కనిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎలాంటి సమస్యల్లో చిక్కుకొని.. వాటి నుంచి ఎలా బయటకు వచ్చాడు అనేది ఈ సినిమా క‌థ‌. తనికెళ్ల భరణి డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో సుధాకర్ కోమాకల కీలక పాత్రలో నటిస్తున్నాడు. తనికెళ్ల భరణి, హర్ష వర్దన్, సుధాకర్ , సాయి కుమార్ వంటి టాలెంటెడ్ నటులు కూడా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో వేచి చూడాలి.

https://youtu.be/M8I7cs7F9Ng

Read more RELATED
Recommended to you

Exit mobile version