హుజూర్ నగర్ ఇది కాంగ్రెస్ సీనియర్ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఇది కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఉత్తమ కుమార్ రెడ్డి పలుమార్లు గెలిచి సత్తా చాటారు. గత ఎన్నికల్లో కూడా గెలిచారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలిచిన తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం వల్ల జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ బిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు.
అప్పుడు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఈసారి కూడా బిఆర్ఎస్ హుజూర్ నగర్ లో తమ అభ్యర్థిగా సైదిరెడ్డి పేరుని ప్రకటించింది. సైదిరెడ్డి ఎన్నికలలో గెలిచిన దగ్గర నుండి నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గం అభివృద్ధి చేశారు. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సొంత పార్టీలో కూడా సైదిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేవారు కానీ, విమర్శించేవారు గానీ లేకపోవడంతో సైదిరెడ్డి హుజూర్ నగర్ లో ఈసారి గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక సైదిరెడ్డికి చెక్ పెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నారు. ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికార బలంతో వలనే సైదిరెడ్డి గెలుపు సాధ్యమైందని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్తితు ఉండదని ఉత్తమ్ భావిస్తున్నారు.
ఈసారి తనే స్వయంగా రంగంలోకి దిగుతానని తను అభ్యర్థిగా ఉంటే ఎంతటి మహామహులైన ఓటమిని పొందాల్సిందే అని హుజూర్ నగర్ లో ఈసారి ఎగిరేది కాంగ్రెస్ జెండానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారి హుజూర్ నగర్ ఓటర్లు కారెక్కుతారా?? హస్తం వైపు చూస్తారా??? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.