దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపుమేరకు దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ ను నియంత్రించడానికి దేశ ప్రజలంతా స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో రాజస్థాన్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజస్థాన్ రాష్ట్రం అయితే ఏకంగా ఈ నెల 22 నుండి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది.
ఇదే బాటలో తాజాగా పుదుచ్చేరి కూడా లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పుదుచ్చేరి సీఎం తెలిపారు. పాండిచ్చేరి రాష్ట్రం కూడా లాక్ డౌన్ లోకి వెళ్లనుంది. మొత్తంమీద ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే భారతదేశం మొత్తం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ చేస్తే గాని ఈ వైరస్ అరికట్టే మార్గం లేదని భావిస్తున్నారు రాజకీయ నేతలు.