వైసీపీలో అదిరే ట్విస్ట్..మంత్రికే సీటు లేదంట?

-

రాజకీయాల్లో నాయకులు కాదు పార్టీ శాశ్వతం అనే నమ్మేవారిలో జగన్ ముందువరుసలో ఉంటారని చెప్పవచ్చు. పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటే..కింది స్థాయి నాయకుడు ఉన్నా సరే గెలుపు సులువే. అందుకే పార్టీ అనేది ముఖ్యం. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పిలోకి జంప్ చేశారు. దీంతో వైసీపీ పని అయిపోయిందనే ప్రచారం వచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చారు..అంటే పార్టీని, అధినేత జగన్‌ని జనం ఓటు వేయడం వల్ల అని సీట్లు వచ్చాయనే చెప్పాలి.

ఈ సారి కూడా అదేవిధంగా జగన్ ముందుకెళ్లనున్నారు. పార్టీ బలం, తన ఇమేజ్ తోనే ఎన్నికలకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యేలపై ఎక్కువ నమ్మకం పెట్టుకోలేదు. ఎందుకంటే అందులో కొందరిపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది. దీంతో వారిని మార్చాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వారిని మారిస్తే పార్టీకి లాభమే తప్ప..నష్టం లేదనే చెప్పాలి. పార్టీ గెలుపు కోసం జగన్ ఎంతటి నాయకుడినైనా పక్కన పెట్టడానికి వెనుకాడటం లేదని తెలుస్తుంది.

పనితీరు బాగుకుండా, ప్రజా వ్యతిరేకత ఉన్న వారిని సైడ్ చేయడం ఖాయమని తెలుస్తుంది. ఆ లిస్ట్ లో మంత్రులు ఉన్నసరే జగన్ వెనక్కి తగ్గకూడదని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మంత్రికి సీటు ఇచ్చే విషయంలో జగన్ ఆచితూచి అడుగులేస్తున్నారట. రాయలసీమకు చెందిన ఓ మంత్రి పనితీరు మరీ దారుణంగా ఉందట..ఆయనకు సొంత నియోజకవర్గంలో కూడా వ్యతిరేకత కూడా ఎక్కువ ఉందట.

దీంతో ఆయన్ని ఈ సారి పక్కన పెట్టేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇదే క్రమంలో ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే వారసురాలని రంగంలోకి దింపాలని చూస్తున్నారని తెలిసింది. వారిపై ప్రజల్లో సానుభూతి ఉందని తెలిసింది. అందుకే జగన్ మంత్రిని సైడ్ చేసి..మాజీ ఎమ్మెల్యే వారసురాలుని బరిలో ఉంచుతారని తెలుస్తుంది. చూడాలి మరి నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ నిర్ణయాలు ఎలా ఉంటాయో.

Read more RELATED
Recommended to you

Exit mobile version