బాబుకు దూరమే..పురందేశ్వరితో వ్యూహం..!

-

ఏపీ బీజేపీలో జరిగిన మార్పు…ఇప్పుడు అక్కడ రాజకీయాల్లో పెను సంచలనాలకు దారితీసేలా ఉంది. ఇప్పటివరకు జగన్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శలు ఎదుర్కుంటున్న సోము వీర్రాజుని ఏపీ బి‌జే‌పి అధ్యక్ష పదవి నుంచి తప్పించి దగ్గుబాటి పురందేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించారు. దీంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

అయితే తెలంగాణలో మార్పులు అనేది అక్కడ పరిస్తితులని బట్టి జరిగాయి. కానీ ఏపీలో బి‌జే‌పికి పెద్ద బలం లేదు..ఇప్పటికిప్పుడు సాధించేది ఏమి లేదు. ఇప్పుడు పురందేశ్వరిని అధ్యక్షురాలుగాగా పెట్టడం ద్వారా బి‌జే‌పి ఏం చేయాలని అనుకుంటుందనేది అర్ధం కాకుండా ఉంది. ఎలాగో ఏపీ ప్రజలు బి‌జే‌పిని విశ్వసించడం లేదు. అలాంటప్పుడు సోము ఉన్నా, పురందేశ్వరి ఉన్నా ఒకటే అవుతుంది. అయితే సోము పూర్తిగా జగన్ మనిషి అనే ముద్రవేసుకున్నారు. దీంతో ఆయన్ని మార్చారు అనుకుంటే…పురందేశ్వరి ద్వారా..టి‌డి‌పి, జనసేనలతో పొత్తులకు అనుకూలంగా ఉన్నామని హింట్ ఇస్తున్నారా? లేక అటు వైసీపీకి, ఇటు టి‌డి‌పికి కూడా దూరమే అని చెప్పాలని అనుకుంటున్నారా? అనేది క్లారిటీ లేదు.

అయితే సోముని తప్పించి..వైసీపీపై విరుచుకుపడుతున్న సత్యకుమార్‌ని అధ్యక్షుడుగా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో దానికి బ్రేక్ పడింది. సత్యకుమార్ అధ్యక్షుడు అయితే టి‌డి‌పితో పొత్తుకు సుముఖమే అనే పరిస్తితి ఉండేది.  పురందేశ్వరిని నియమించడం చూస్తుంటే.. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాలని బీజేపీ నిర్ణయించినట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

జగన్‌ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న సత్యకుమార్‌ను కాదని, మధ్యేమార్గంగా పురందేశ్వరిని నాయకత్వం ఎంచుకుందని బీజేపీ వర్గాలు కూడా అంటున్నాయి. అంటే టి‌డి‌పితో పొత్తుకు బి‌జే‌పి దూరమే అనే సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే…దాని బట్టి…బి‌జే‌పి రాజకీయం చేసేలా ఉంది. చూడాలి మరి పురందేశ్వరి నాయకత్వంలో బి‌జే‌పి ఎలా ముందుకెళుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version