హర్యానా ఎన్నికల బరిలో ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫొగాట్…? అందులో నిజమెంత ?

-

పారిస్ ఒలింపిక్స్‌తో సంచ‌ల‌నంగా మారిన భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్ ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది.. అనర్హత వేటు పడినా.. ఆమె ప్రతి కదలిక ఒక సంచలనంగా మారింది.. తాజాగా ఆమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ పోటీ చేస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు..

క్రీయాశీలక రాజకీయాల్లోకి తాను రానని ఆమె చెప్పినట్లు వార్తలు వస్తున్నా.. ఆమె సన్నిహితులు మాత్రం వాటిని కొట్టి పారేస్తున్నారు. ఆమెను ఒప్పించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి..

అయితే వినేశ్ ఫొగాట్ ఏ పార్టీలో చేరుతారో అనే దానిపై స్పష్టత లేదు.. హర్యానా అసెంబ్లీలో వినేశ్ ఫొగాట్ వర్సెస్ బబితా ఫొగాట్, బజరంగ్ పునియా వర్సెస్ యోగేశ్వర్ దత్‌లను చూసే అవకాశముందని చర్చ నడుస్తోంది.. ఫొగాట్ ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమని ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెప్పడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫోగ‌ట్‌ తన సోదరి బబితా ఫోగట్‌తో ముఖాముఖి పోటీపడే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది.. ఈ ప్రచారం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Exit mobile version