వచ్చే ఎన్నికల్లో కవిత ఎక్కడ నుంచి పోటీ చేస్తారు.? ఈ సారి ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తారా? లేక పార్లమెంట్‌కు పోటీ చేస్తారా? అంటే ఇప్పుడే సమాధానం తెలిసే పరిస్తితి లేదు. ఎందుకంటే కవిత పోటీ చేసే విషయంలో కేసిఆర్ వ్యూహం ఎలా ఉందో అర్ధం కావడం లేదు. ముందు కుటుంబంలో ఉన్న కేటిఆర్, హరీష్ రావులు అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేయడం ఖాయం..అందులో ఎలాంటి డౌట్ లేదు.
ఇక కేసిఆర్ మొదట అసెంబ్లీకే పోటీ చేస్తారని, పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే..ఆయన కేటిఆర్ కు బాధ్యతలు ఇచ్చి…ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని అంటున్నారు. అయితే కేసిఆర్ పోటీపై కాస్త క్లారిటీ లేదు. అదే సమయంలో కవిత విషయంలో కూడా అదే జరుగుతుందని అంటున్నారు. మొదట అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం మొదట ముఖ్యం కాబట్టి..అంతా అసెంబెలీ స్థానాల్లో పోటీ చేసి..గెలిచి అధికారంలోకి వస్తే..ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కేసిఆర్, కవిత బరిలో దిగుతారని తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఉపఎన్నికలు వస్తే బిఆర్‌ఎస్ అధికారంలో ఉంటుంది కాబట్టి గెలిచే ఛాన్స్ ఉంటుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.
ఈ క్రమంలోనే మొదట కవితని జగిత్యాల బరిలో ఉంచుతారని తెలుస్తోంది. అక్కడ ప్రస్తుత బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కు అంత అనుకూలత లేదు. పైగా అక్కడ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బలపడుతున్నారు. ఆయన్ని నిలువరించాలంటే కవిత నిలబడాల్సిందే. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ఆమె నిజామాబాద్ ఎంపీగానే పోటీ చేస్తారని తెలుస్తోంది. ఓడిన చోటే గెలవాలని చూస్తున్నారు. అక్కడ ధర్మపురి అరవింద్ కు చెక్ పెట్టి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. మొత్తానికైతే కవిత రెండు సీట్లలో పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తుంది.