నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని చెప్పి కసితో పనిచేస్తున్న చంద్రబాబు..టిడిపి గెలవడం కోసం రకరకాల వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోవడం వల్ల వైసీపీ చేతుల్లో చావుదెబ్బ తిని ఉన్నారు. కానీ ఈ సారి కూడా అధికారం కోల్పోతే టిడిపి ఇంకా ఉండదు. అందుకే బాబూ పార్టీని గెలిపించడం కోసం అనేక వ్యూహాలు వేస్తున్నారు. ఇదివరకు మాదిరి మెతక వైఖరితో ఉండకుండా..పార్టీ గెలవడం కోసం సొంత పార్టీ నేతలకు గట్టి క్లాస్ ఇస్తున్నారు.
సరిగ్గా పనిచేయకపోతే సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో ఆ నాయకుడు, ఈ నాయకుడు అని చూసుకోవడం లేదు. పార్టీ జెండా మాత్రం ఎగరాలి అని భావిస్తున్నారు. అవసరమైతే కొందరు సీనియర్లకు కూడా మొహమాటం లేకుండా సీటు ఇవ్వకూడదని చూస్తున్నారు. అదే ఫ్లోలో బాబు ముందుకెళుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో బలమైన అభ్యర్ధులని పెడతానని, అలాగే 40 శాతం సీట్లు యువతకే ఇస్తానని అంటున్నారు.
అందుకే ఇప్పటికే నుంచే సీట్లు కూడా ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. అలా అని ఎన్నికల సమయానికి ఏ నేత అయినా సరిగ్గా పనిచేయకపోతే అప్పుడైనా సీటు ఇవ్వనని చెప్పేస్తున్నారు. పోటీ చేసే అభ్యర్ధి కాదు ముఖ్యం..పార్టీ ముఖ్యమని ఆయన అంటున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో కొందరు నేతలకు సీట్లు ఇవ్వడం కష్టమని తేలిపోయింది.
అదే సమయంలో పొత్తులో ముందుకెళితే కొన్ని సీట్లు జనసేనకు వదులుకోవాల్సింది. దీంతో టిడిపిలో కొందరు నేతలు త్యాగాలు చేయాల్సిందే. మొత్తానికి బాబు పార్టీ కోసం కొందరు నేతలని సైడ్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు.