మనసులో మాట బయటపెట్టిన పురందేశ్వరి.. కేంద్ర మంత్రిగా అవకాశం రానుందా..?

-

ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. పార్టీ బలోపేతం అయింది.. తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుని బిజెపి ఎన్నికలకు వెళ్ళింది.. నేతలను సమన్వయం చేసుకుంటూ, 8 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలను గెలిపించుకోవడంలో పురందేశ్వరి విశేష కృషి చేసిందని బిజెపి కేంద్ర నాయకత్వం గట్టిగా నమ్ముతుంది.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పిలుపును ఆమె విజయవంతం చేస్తున్నారు . బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా రెండేళ్లు పూర్తి చేసుకున్న పురందేశ్వరికి.. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు.. ఆమెకు కేంద్ర మంత్రిగా అవకాశం లభిస్తుందంటూ పార్టీలో ప్రచారం నడుస్తుంది..

ఏపీలో పెద్ద ఎత్తున బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది.. జాతీయ స్థాయి నుంచి ఏపీ దాకా అంత పండుగ వాతావరణం కనిపిస్తోంది.. విశాఖలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పురందేశ్వరి.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.. అక్టోబర్ చివర్లో.. జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కొత్త నాయకత్వాలు తెరమీదకి వస్తాయంటూ పార్టీ శ్రేణులకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.. ఏపీ బీజేపీ కూడా కొత్త నాయకత్వం రాబోతుందని చెప్పకనే చెప్పారు.. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం బిజెపిలో చర్చలు జోరుగా సాగుతున్నాయి..

కేంద్ర మంత్రి పదవి కోసం పురందేశ్వరి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది.. ఆమె పార్టీ బాధ్యతను వదులుకుంటే కేంద్రమంత్రిగా ఛాన్స్ దక్కుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన ఆమె.. ఈసారి క్యాబినెట్ ర్యాంక్ మంత్రిగా పనిచేయాలని ఆశిస్తున్నారట.. కేంద్ర క్యాబినెట్ విస్తరణలో.. తమ నాయకురాలికి అవకాశం ఉంటుందని ఆమె అనుచరులు చర్చించుకుంటున్నారు.. మరోపక్క ఏపీ అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతుందా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version