చంద్రబాబు అసహనానికి కారణం అదేనా..?

-

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది.. మరొకరైతే ఇప్పుడల్లా జనాల్లోకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు.. కానీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.. జనాలకు ఆపదొచ్చిందంటే చాలు అక్కడ వాలిపోతున్నారు.. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు పర్యటనలు చేసిన జగన్మోహన్ రెడ్డి తాజాగా.. విజయవాడ వరద బాధితులకు భరోసాని ఇచ్చారు.. జగన్ వస్తున్నారంటే వేలమంది ఆయన్ని చూసేందుకు రోడ్డుమీదకు వస్తున్నారు.. ఈ వ్యవహారమే చంద్రబాబు నాయుడుకి అసహనాన్ని తెప్పిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

తెలుగుదేశం పార్టీ నేతల దాడుల్లో గాయపడిన కార్యకర్తలకి అండగా ఉండేందుకు వైసిపి అధినేత జగన్ ఈ మధ్యకాలంలో పరామర్శలు చేపట్టారు.. ఆయన ఏ ప్రాంతానికి వెళ్లిన జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.. ఆయన మాట్లాడి ఉపన్యాసాలకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది.. తాజాగా విజయవాడ వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జగన్.. సీఎం చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేశారు.. దీనికి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆదరణ వచ్చింది.. ఇవన్నీ చూసిన చంద్రబాబునాయుడు తీవ్ర అసహనానికి గురవుతున్నారట.. జగన్ జనాల్లోకి వస్తే.. తమకి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని.. ఆయన భావిస్తున్నారట. దీంతో వరదలకు, విజయవాడను వరద ముంచెత్తడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ టిడిపి నేతలు కొత్త పల్లవి ఎత్తుకోవడానికి చంద్రబాబు అసహనమే కారణమని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది..

అధికారంలోకొచ్చి నాలుగు నెలల వ్యవధిలోని విజయవాడ భారీ వరద ముంచెత్తడం కూటమి ప్రభుత్వానికి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు.. ప్రజలకు సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం సతమతమవుతోంది.. ఈ క్రమంలో జగన్ జనాల్లోకి వెళ్లడం ఆయన పేరు ఏదో రకంగా చర్చనీయాంశం కావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారట.. జగన్మోహన్ రెడ్డి జనాలకు చేరు అవ్వడమే చంద్రబాబు కోపానికి కారణమని రాజకీయ వర్గాల నేతలు విశ్లేషిస్తున్నారు.. ఎలాగైనా జగన్ను జనానికి దూరం చేయాలని చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది ఆయన వల్ల కావడం లేదనే టాక్ వినిపిస్తోంది.. జగన్ నిత్యం జనాల్లో ఉంటే ప్రభుత్వాన్ని, తమని సైతం జనాలు మర్చిపోతారని ఆందోళనలో ఆయన ఉన్నారట..

Read more RELATED
Recommended to you

Exit mobile version