ఇటీవల ఏపీ రాజకీయాల్లో పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లు పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. వారాహి యాత్ర చేస్తూ పవన్…జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే..వైసీపీ అక్రమాలపై ఫైర్ అవుతున్నారు. ఇక అదే తరహాలో పవన్ కు వైసీపీ కౌంటర్లు ఇస్తుంది. కాకపోతే వైసీపీ పూర్తిగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది. పవన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా..ఆయనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుంది. దీంతో రాజకీయం వేరే స్థాయికి వెళుతుంది.
ఇక ఇందులో జగన్ కూడా ఉంటున్నారు..పవన్ పెళ్లిళ్ల గురించి ఆయన పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. ఇలా పెళ్లిళ్లపై మాట్లాడటం వల్ల పవన్ కు వచ్చే నష్టమేమీ లేదు..కానీ రివర్స్ లో వైసీపీపైనే ప్రజలు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలని, ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదనే వాదన వస్తుంది. అయితే తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంపై కూడా పవన్ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు..జగన్ తో సహ వైసీపీ నేతల చీకటి బాగోతాలు తనకు తెలుసని, కానీవాటిని బయటపెట్టడం సంస్కారం కాదని అంటున్నారు.
ఇలా వైసీపీ నేతలకు, పవన్ తేడా ఉంది. ఈ పోరు మెజారిటీ ప్రజలు పవన్ వైపే ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ చేసే రాజకీయం ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే అలా పవన్‌ని టార్గెట్ చేసి..ఆయన బలాన్ని పెంచాలని వైసీపీ చూస్తుందా? అనే డౌట్ వస్తుంది. అలా చేయడం వల్ల పవన్ బలం పెరుగుతుంది..అలాగే టిడిపి పొత్తు విషయంలో డిమాండ్లు పెరుగుతాయి. వాటి వల్ల పొత్తు చెడిపోతే పవన్ సింగిల్ గా పోటీ చేస్తారని, అప్పుడు భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని, దాంతో టిడిపికి నష్టం, వైసీపీకి లాభం జరుగుతుందనే స్కెచ్ వేసినట్లు ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి పవన్‌ని తిట్టడంలో వైసీపీ వ్యూహం ఉందో లేదో.