వైసీపీకి ఐటీడీపీ దెబ్బ..విజయ్‌కు స్కెచ్ అందుకే..!

-

ఏపీ రాజకీయాల్లో వైసీపీ చాలా బలమైన పార్టీగా ఉన్న విషయం తెలిసిందే..అధికారంలో ఉండటంతో వైసీపీ నెంబర్ 1 పొజిషన్‌లో ఉంది. అలాగే రాజకీయంగా టీడీపీపై ఎప్పటికప్పుడు పైచేయి సాధిస్తుంది. అయితే సోషల్ మీడియాలో కూడా వైసీపీ హవా ఎక్కువనే సంగతి తెలిసిందే. అసలు 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయానికి ఈ సోషల్ మీడియా టీం కూడా ఒక కారణం. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గైడెన్స్‌తో పలువురు నేతల ఆధ్వర్యంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు దూకుడుగా పనిచేశారు.

ఉన్నవి లేనివి సృష్టించడం..ఎప్పటికప్పుడు టీడీపీకి చెక్ పెట్టేలా ముందుకెళ్లడం..అబ్ద్దాలని నిజాలుగా మార్చడం..నిజాలని అబద్దాలుగా మార్చడం..ఇలా ఒకటి ఏంటి..తిమ్మిని బొమ్మిని చేసి టీడీపీని ఒక ఆట ఆడేసుకున్నారు. ఆఖరికి చంద్రబాబు తాగే వాటర్ బాటిల్ గురించి ప్రజల్లోకి నెగిటివ్‌గా వెళ్ళిందంటే అది వైసీపీ సోషల్ మీడియా చలువే. ఇలా టీడీపీని దెబ్బకొట్టి వైసీపీ విజయంలో సోషల్ మీడియా విజయం సాధించింది.

అయితే 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ రూట్ మార్చేసింది..అనూహ్యంగా సోషల్ మీడియాలో వైసీపీని దెబ్బకొట్టాలని చెప్పి ఐటీడీపీ ఏర్పాటు అయింది..మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఆధ్వర్యంలోనే ఈ ఐటీడీపీ పనిచేస్తుంది. ఎక్కడక్కడ వైసీపెనీ ఇరికించేలా పోస్టులు, వైసీపీ తప్పిదాలు, గతంలో జగన్ చెప్పిన హామీ ఏంటి..ఇప్పుడు చేస్తుందన్నది ఏంటి అని జనాలకు క్లియర్ గా వివరించడం. వైసీపీ పోస్టులకు స్ట్రాంగ్‌గా టీడీపీ నుంచి కౌంటర్లు ఇస్తూ ఉండటం ఎక్కువైంది.

వైసీపీ సోషల్ మీడియాకు ధీటుగా ఐటీడీపీ వచ్చింది. అయితే సోషల్ మీడియాలో జగన్ గురించి నెగిటివ్ గా పెడితే..సి‌ఐ‌డి కేసులు పెట్టి టీడీపీ కార్యకర్తలని జైలుకు పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వైసీపీ కార్యకర్తలపై ఒక్క కేసు కూడా పెట్టలేదు..ఎందుకంటే అధికారం వైసీపీదే కనుక. అయితే సి‌ఐ‌డి పెట్టిన సోషల్ మీడియా కేసులు కోర్టులో పెద్దగా నిలబడలేదు. ఇక ఇటీవల వైఎస్ భారతిపై ఐటీడీపీ నుంచి పోస్టులు పెరిగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి..అలాగే ఫోన్ పే, గూగుల్ పే మాదిరిగా భారతిపే అని చెప్పి పోస్టులు వచ్చాయి.

దీంతో సి‌ఐ‌డి యాక్షన్‌లోకి దిగి..విజయ్‌కు నోటీసులు ఇచ్చారు. అలాగే సి‌ఐ‌డి విజయ్ ఇంటికెళ్ళి చిన్నపిల్లలని సైతం ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి ఐటీడీపీని కట్టడి చేసేందుకు వైసీపీ..విజయ్‌ని టార్గెట్ చేసిందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version